Saturday, January 6, 2024

Baby Leaks 2023




Baby Leaks Pdf and Videos  

👉 DOWNLOAD HERE

 

 _______________________________________________________

 

 Page 2

స్పూఫ్ సినిమాలు తీస్తే డైరెక్టర్ కాదా ! కథే రాయాలంటే, కష్టపడాలా ఏంటి !!!


Preface (ముందు మాట)

I am Shirin Sriram, film director and now producer of a movie titled ‘Preminchoddu’. It's a Pan-India movie made in 5 languages.
In 2015 a team of 6 writers and I wrote a story of a Basti girl who falls in love with 2 boys, one boy is poor and another is rich. We narrated this story, in the same year, to Director/Producer Neelam Sai Rajesh. He told us that he would produce the film and hence me and my team worked with him for one year, in his ‘Amrutha Productions’ office. But he did not produce.
Later in the year 2023 he made a movie named ‘Baby".After thorough analysis, my team and I came to a conclusion that the same ‘Preminchoddu’(Working Title: ‘Kanna Please’) movie story has been stolen and modified to make this movie named ‘Baby’.
Kindly go through this document to know more.
నా పేరు శిరిని శ్రీరామ్. నేను ఒక దర్శకుడిని . 'ప్రేమించొద్దు' అనే సినిమా నిర్మించాను. ఇది 5 భాషల్లో విడుదల అవ్వబోయే పాన్-ఇండియా చిత్రం. 2015 సంవత్సరం లో ఆరుగురు రచయితల బృందంతో ఒక సినిమా కథ రాశాను. ఒక బస్తీ అమ్మాయి ఒక బీద వాడితో మరియు ఒక ధనికుడితో ప్రేమలో పడుతుంది అనేదే  కథాంశం. అదే సంవత్సరం దర్శకుడు/నిర్మాత  నీలం సాయి రాజేష్ కి కథ చెప్పాను. అతను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. మేము అతని 'అమృత ప్రొడక్షన్స్' ఆఫీసులో సంవత్సరంకి పైగా పని చేశాం. కానీ అతడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, ప్రొడ్యూస్ చేయలేదు. 2023 లో సాయి రాజేష్ 'బేబి' అనే సినిమాకి దర్శకత్వం చేశారు. చాలా రోజులు సమీక్ష తరువాత, మా 'ప్రేమించొద్దు'(మొదటగా పెట్టిన పేరు 'కన్నా ప్లీజ్')  కథను తస్కరించి, మసాల పూసి, వాళ్ళ సొంత నమూనాగా తీర్చిదిద్దుకున్నారు అని నిర్ధారణకు వచ్చాము.
దయచేసి ఈ డాక్యుమెంట్ మొత్తం చూడగలరు

_______________________________

Friends Enquiring (స్నేహితుల అనుమానాలు)

When the Telugu movie ‘Baby’ released, I got a lot of messages and phone calls from friends . Confirming that the filmmakers lifted my movie storyline and remixed into their own version .
All these people are aware of my movie story and some of them even know that I worked with Amrutha Productions, owned by Sai Rajesh (Movie Director and Producer), as a Movie director for over one year.
Srujan Reddy is a Cinematographer, was supposed to do the Cinematography for my film, to whom i narrated the story for around 6 hours in the year 2015. He messaged me back after a long time , after watching Baby and expressed his pain
తెలుగు చిత్రం ‘బేబి’ విడుదల అయినప్పుడు నా స్నేహితులు చాలా మంది మెసెజ్లు మరియు ఫోన్ కాల్ చేశారు. నా సినిమా (ప్రేమించొద్దు) కథ స్నేహితులకు ముందుగా తెలియడం వలన, నీ కథను తస్కరించి, మసాల పూసి, వాళ్ళ సొంత నమూనాగా తీర్చిదిద్దుకున్నారు అని నాకు నిర్ధారణ చేశారు.
సాయి రాజేష్ సంస్థ  ‘అమృత ప్రొడక్షన్స్' లో ఒక్క సంవత్సరం పైగా నేను దర్శకుడిగా పనిచేశానని కూడా నా ఈ స్నేహితుల్లో కొందరికి తెలుసు.
శృజన్ రెడ్డి అనే కెమెరా మెన్ నా సినిమాకి ఛాయాగ్రహణం చేయవలసి వుండేది, అందువలన నేను 2015వ సంవత్సరంలో సుమారు 6గం||లు నా సినిమా (ప్రేమించొద్దు) కథను అతనకి వివరంగా చెప్పాను. అతను చాలా రోజుల తర్వాత నాకు మెసేజ్ చేశాడు. బేబి సినిమాను చూసి ఎంతో బాధగా ఆవేదనచెందాడు. “సిగ్గులేకుండా కథలు దొంగిలించేవారికి ఇంకెప్పుడు నీ సినిమా కథని చెప్పద్దు!” అని నన్ను హెచ్చరించాడు.

                                                                                                                    Page 3

Telugu Actress Gayathri Gupta messaged me the teaser of the film ‘Baby’ and spoke to me on phone. Gayathri has auditioned for my film for the lead role . Recently she has also seen the movie ‘Preminchoddu’.
Webseries Writer and Director Hareesh Nagaraj messaged me saying ‘Baby’ movie trailer concept looked similar to Preminchoddu movie storyline.
తెలుగు నటి గాయత్రి గుప్తా నాకు ‘బేబి’ సినిమా టీజర్ ని పంపించి, ఫోన్ చేశారు. గాయత్రి నా సినిమా లో ముఖ్య పాత్రచేయడానికి స్క్రీన్ టెస్ట్ కి కూడా వచ్చారు. ఇటీవల తనకి ప్రేమించొద్దు సినిమాని చూపించాను.
వెబ్ సీరీస్ రచయిత మరియు దర్శకుడు అయిన హరీష్ నాగరాజు ‘బేబి’ సినిమా ట్రెయిలర్ చూసి, నీ సినిమా ప్రేమించొద్దు కథ లానే వుంది అని నాకు మెసేజ్ చేశాడు.

                                                                                                                    Page 4

Manikanta is an Engineer and also a Film Student living in Germany . He worked on my movie script . His work was to correct the Telugu language in my Movie Script.
Mahesh Pasham worked in my team as a Sound Recordist
మణికంఠ జర్మనీలో ఒక ఇంజనీర్ మరియు సినిమా విధ్యార్ధి. తను నా కథ మీద పని చేశాడు, తెలుగు భాషలో తప్పులు సరిదిద్దడం అతని పని. ‘బేబి’ డైరెక్టర్ సాయి రాజేష్ కి నీవు మొట్టమొదటి గా ఈ కథని చెప్పావు కదా, ‘బేబి’ సినిమా కథ తన స్నేహితుడు చెప్పినప్పుడు, తనకి ‘ప్రేమించొద్దు’ కథ లానే వుంది అని అనిపించిందని అన్నాడు.మహేష్ పాశం మా సౌండ్ రికార్డిస్ట్, ‘బేబి’ ట్రైలర్ పంపించి, కథ మన సినిమాలానే వుంది అని అన్నాడు.
Director Shri Kishore Voice Message :
“Hi Shirin ela unnav ?....last time naaku cinema share chesaav … adhi baby movie line laaga undhi ..enti adhi ? “
Sonali is my Associate director , she watched the movie on the first day and messaged me
Akshay Kumar Pusthey is from my Direction team . He watched the movie in the United Kingdom .
డైరెక్టర్ శ్రీ కిషోర్ వాయిస్ మెసేజ్ : " హాయ్ శిరిన్ ఎలా వున్నావ్ ? ... లాస్ట్ టైం నాకు సినిమా షేర్ చేశావ్ ... అది ‘బేబి’ సినిమా లైన్ లాగా వుంది.... ఏంటి అది? "
సోనాలి నా అసోసియేట్ డైరెక్టర్ సినిమా యాభై శాతం మన సినిమా లాగే వుంది అని మెసేజ్ చేసింది.
అక్షయ్ కుమార్ పుస్తే నా డైరెక్షన్ టీంలో కుర్రాడు, ఇంగ్లాండ్ దేశంలో వుంటాడు. ‘బేబి’ సినిమా చూస్తున్నా మన సినిమా లాగా వుంది ఏంటి” అన్నాడు.



_______________________________

                                                                                                                    Page 5 

Interviews (ఇంటర్వ్యూలు)

Director Sai Rajesh is unable to tell the interviewer where exactly he got the story of ‘Baby’ movie. In one particular interview he said that he had written the story in only 3 days and his movie screenplay was never ever written. Also says he wrote all the dialogues on the movie sets only. Please watch these interviews below to see many more wonders like these .
దర్శకుడు సాయి రాజేష్ ని తనకు 'బేబి' కథ ఎక్కడ దొరికింది అని 'ఇంటర్వ్యూ' చేసేవాళ్ళు అడిగినప్పుడు ఒక నిర్దిష్టమైన సమాధానం చెప్పలేకపోతూన్నాడు. ఒక ఇంటర్వ్యూ లో అయితే తాను ఈ కథ 3 రోజుల్లోనే పూర్తి చేశాను అనీ, స్క్రీన్-ప్లే  ఎప్పటికీ రాయలేదననీ, డైలాగులు సినిమా 'సెట్'లోనే రాశేవాడినీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి వింతలు మరిన్ని చూడాలంటే ఈ కింది ఇంటర్వ్యూలను చూడండి.


_______________________________

                                                                                                                     Page 6

FLASH BACK 2015 (2015 సంవత్సరం)

సుమారు మార్చ్ - ఏప్రిల్ 2015 లో, నాతో షార్ట్ ఫిలిమ్స్ లో పని చేసిన డైరెక్టర్ రవి కిరణ్ రాజు, 

తమిళనాడులో జరిగిన ఒక సంఘటన కి సంబంధించిన ఒక వార్తని చూపించడం జరిగింది. 'ఒక బస్తీ 

అమ్మాయిని ఇద్దరు యువకులు తమను ప్రేమలో మోసం చేసింది అనే కారణంతో చంపారు' అనేదే ఆ 

వార్త. అదే వార్త నా సినిమా కథ రాయడానికి ప్రేరణగా మారింది. నేను కేవలం ఆ కథ లో ఈ ఒక్క 

ఘోరమైన సంఘటనను మాత్రమే తీసుకున్నాను కానీ, మిగితా సినిమా కథ అంతా నేనే అల్లాను. 

దర్శకుడు రవి కిరణ్ కి ఈ కథ వ్రాయడం లో నాకు రెండు రోజులు సహాయపడ్డాడు. తరువాత తనకి ఉన్న పనుల వల్ల రాలేకపోయాడు. తదుపరి నేను, నాతో ఎప్పటి నుంచో పని చేయాలి అనుకునే జర్నలిజం విద్యార్థిని 'వైష్ణవి మౌనిక' ని కథా చర్చ కి ఆహ్వానించాను. తను నా సినిమాలో ఇప్పటికీ పని చేస్తుంది. మేము 60కి పైగా సన్నివేశాలను రాశాము.

ఈ సినిమా కి తాత్కాలికంగా "కన్నా ప్లీజ్" అని టైటిల్ పెట్టుకున్నాము. 'కన్నా' కి మీరు అర్ధం తీసుకుంటే, బుజ్జి-కన్నా బంగారు-కన్నా అని తెలుగు భాషలో మనం తరచుగా మనకి నచ్చినవాళ్లని ఆ పేరుతో పిలుస్తూ ఉంటాం. దీన్నే పాశ్చాత్య సంస్కృతి లో "బేబి" అని కూడా అంటారు. ఈ మధ్య మనకు సినిమాల్లో కూడా ఈ 'బేబి' అనే పదం బాగా వినపడుతుంది.
తరువాత నేను, నా రచయిత మరియు దర్శక స్నేహితులతో ఈ కథ సారాంశం చర్చించేవాడిని. '
కన్నా ప్లీజ్' అనే సినిమా టైటిల్ నమోదు చేయని కారణంగా నేను అందరికీ 'టీన్ మూవీ' అనే పేరుతో చెప్పేవాడిని. ఈ తరుణం లో దర్శకుడు సాయి రాజేష్ ని నేను బంజారాహిల్స్ లో 'రాక్ క్యాజిల్'  అనే షూటింగ్ లొకేషన్ లో కలిశాను. (అతనితో నా ప్రయాణం గూర్చి తదుపరి పేజీలలో చెప్తాను)
నేను అతనికి సుమారుగా 60 సన్నివేశాలని వివరించాను. తను ఠక్కున క్యాచ్ చేసి "నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను" అన్నాడు. అంతేకాకుండా తన మిత్రుడైన SKN అని పిలువబడే సినిమా నిర్మాత ద్వారా, తెలుగులో అతిపెద్ద సినిమా నిర్మాణసంస్థ అయిన 'గీతా ఆర్ట్స్'కి, ఈ కథని తీసుకెళ్తాను అని, హామీ ఇచ్చాడు. అప్పట్లో గీతా ఆర్ట్స్ వాళ్ళు తమ రెండవ సినిమా బ్యానర్ GA-2 ని మొదలుబెట్టబోతున్నారని, అందులో చిన్న సినిమాలకి అవకాశాలు తప్పక ఇస్తారని నమ్మబలికాడు.

It was around March-April of the year 2015 that I came across an article shared by Writer Director Ravi Kiran Raju , with whom I worked earlier for short films now available on Youtube . The article was from a Tamil Newspaper . That article was the foundation for my movie story . It was about how a ‘Basti’ girl from a very poor background was killed by 2 boys who were her friends because they felt she cheated on them. I first informed Ravi Kiran Raju that I want to take this story line and develop my own story out of this . This story I am going to write will not be similar to what happened in that brutal incident but shall only be a starting point for my story .
Ravi Kiran Raju liked the idea and helped me in the story discussion for 2 days , later he couldn't come to the story discussion for his personal reasons .
Then I invited ‘Vaishnavi Mounika’ , a journalism student who always wanted to work in my movie . She still continues to work in my team . We finished writing 60 plus scenes .
We gave a temporary Working title as “Kanna Please” . ‘Kanna’ in Telugu means a SweetHeart or a loving partner whom you treat like a Baby.  
Then I started discussing the story idea with close friends who are writers and directors , but I never used to tell anyone the Working title ‘Kanna Please’. So I used to tell friends that I was working on a ‘Teen Movie’.
In this process I met Director Sai Rajesh at a place called Rock Castle in Banjara Hills , Hyderabad.
( I shall discuss my association with this director in my next revelations )

                                                                                                                    Page 7
I narrated him roughly 60 scenes and he immediately told me that he would like to produce the film and also take one of his friend named SKN’s help to get support from Geetha Arts a very prestigious Telugu Production house , who were then coming up with a new banner GA 2 productions which is set up to encourage new talent and new scripts


_______________________________

On 13 May 2015
I made an Announcement on a Social Media platform
that I am working with ‘Amrutha Productions’
owned by Director and Producer Sai Rajesh ,
on a Teen Love Story based on true incidents.
True incident refers to the main incident that I saw in the News Article,
which happened in the state of Tamil Nadu.
Note, I even gave a hint “Big Movie Production House”.
It refers to Geetha Arts film production and distribution company .

సాయి రాజేష్ అనబడే నిర్మాత స్థాపించిన అమృత ప్రొడక్షన్స్ అనే సినిమా నిర్మాణసంస్థతో
కలిసి నేను వాస్తవ సంఘటన ఆధారంగా ఒక సినిమా (టీన్ మూవీ) తీయబోతున్నానని
సామాజిక మాధ్యమాలలో ప్రకటించాను. వాస్తవ సంఘటన అనగా నేను వార్తల్లో చూసిన
తమిళనాడులో జరిగిన ఆ కథ. నేను నా ప్రకటనలో "అతిపెద్ద నిర్మాణ
సంస్థ" అని సూచన ఇచ్చాను. అది "గీతా ఆర్ట్స్" ని ఉద్దేశించి ఇచ్చినదే


_______________________________
 
                                                                                                                    Page 8

Mails And messages ( మెయిల్స్ , మెసేజ్లు )

Here I am presenting some important emails related to my Teen-movie works in the year 2015 and 2016 . We used mail, as a Safe storage medium for our movie related works.
2015 -2016 సంవత్సరాల్లో, ప్రేమించొద్దు సినిమా కి సంబంధించిన ముఖ్యమైన పనులను మేము
"ఈ-మెయిల్స్"లో భద్రపరిచేవాళ్ళం.

26 May 2015 (మే)
After the Movie announcement  on 13 May 2015  we released a poster on 26 May 2015,  inviting actors and assistant directors to join our Teen Movie Project . You can see the Amrutha Productions Logo on the top left corner of the Poster .
13 మే 2015న సినిమా తీస్తున్నాము అని ప్రకటించిన తరువాత 26 May 2015 న, ‘అసిస్టెంట్ డైరెక్టర్స్’, ‘యాక్టర్స్’ కావలెను అని ప్రకటన ఇచ్చాం. పోస్టర్ ఎడమవైపు పైన "అమృత ప్రొడక్షన్స్" చిహ్నాన్ని చూడవచ్చు.

26 May 2015 (మే)

Working on the looks of a Basti girl who is the protagonist in the movie

'ప్రేమించొద్దు' సినిమా లో ప్రధానపాత్ర అయిన 'బస్తీ అమ్మాయి' రూపం ఎలా ఉండాలి అనే దాని పై పని చేశాము.

                                                                                                                    Page 9 

18 Jun 2015 (జూన్)

My Direction team of 6 people and I used to go to Amrutha Productions at least 5 days a week, and Update the story to the so called Producer Sai Rajesh, once a week
I have a practice of writing the Story scenes on a white board . This board is attached on the wall of Amrutha Productions office, in the room exclusively meant for our teen-movie Script works . Around 70 scenes can be seen on the white board and
same day another email containing some finished scenes text files .
నేను నా దర్శకబృందంలో ఆరుగురు అమృత ప్రొడక్షన్స్ ఆఫీసుకి వారంలో కనీసం ఐదు రోజులు వెళ్లే వాళ్ళం. వారానికి ఒకసారి సినిమాకథని సాయి రాజేష్ కి 'అప్డేట్' చేసే వాళ్ళం.
నాకు కథలో సన్నీవేశాలను తెల్ల-పలకపై వ్రాసే అలవాటు ఉంది. కింది ఫొటోలో కనిపించే తెల్ల-పలక అమృత ప్రొడక్షన్స్ ఆఫీస్ లో తీసినదే. ఈ గది కేవలం నేను తీసే సినిమా కోసం కేటాయించబడింది. పలక పై 70 సన్నివేశాల వరకు వ్రాసి ఉన్నాయి .
అదే రోజు మరికొన్ని సన్నివేశాలకి సంబంధించిన వివరాలతో కూడిన ఇంకో 'ఈ-మెయిల్' ని కింది ఫోటోలో చూడొచ్చు
.

_______________________________

_______________________________

                                                                                                                     Page 10

26 Jun 2015 (జూన్)

Working on ideas to create a teaser poster

టీజర్ పోస్టర్ కి సంబంధించిన పనులు

20 Jul 2015 (జులై)

Updated Srujan Reddy, who was supposed to do the Cinematography for my Teen-Movie , about the status of the movie script writing and teaser poster design.
ఛాయాగ్రాహకుడు సృజన్ రెడ్డికి కథ మరియు పోస్టర్ కి సంబంధించిన వివరాలు 'అప్డేట్' చేశాను.

11 Aug 2015 (ఆగష్టు) ….Final 113 scenes written on White Board.
In my present movie i have rewritten the scene number 113

113 సన్నివేశాలు పూర్తి అయిన తరువాత తీసిన ఫోటో. ఇప్పుడు నేను తీసిన సినిమాలో 113వ సన్నివేశాన్ని
మార్చి రాశాను.

                                                                                                                    Page 11 

My very hard working, writing and direction team namely Vaishnavi Mounika, Novin Kumar, Rahul Vanam , Prasanna Kumar , Srinivas Porika, and Mounika Reddy.
రాత్రిపగళ్ళు కష్టపడే నా దర్శకబృందం :
వైష్ణవి మౌనిక, నొవిన్ కుమార్, రాహుల్ వనం, ప్రసన్న కుమార్, శ్రీనివాస్ పోరిక మరియు, మౌనిక రెడ్డి


22 Feb 2016 (ఫిబ్రవరి)

Hey! What is my Assistant Director Vaishnavi doing in Amrutha Productions office?
She is  giving final touches to the Teen-Movie Script. This photo was taken in Amrutha Productions office, in the room exclusively meant for our teen-movie Script works
ఓయ్ ! నా అసిస్టెంట్ డైరెక్టర్ వైష్ణవి, 'అమృతా ప్రొడక్షన్స్' ఆఫీసులో ఏం చేస్తుంది?
తను మా సినిమా కథకి తుదిమెరుగులు దిద్దుతుంది. అమృత ప్రొడక్షన్ ఆఫీసులో,  నేను తీసే సినిమా కోసం కేటాయించబడిన గదిలో ఈ ఫోటో తీయబడినది .

                                                                                                                    Page 12 

The text in Green Ink are Songs composed by Chaitanya Sravanthi. The songs placements are exactly the same in my movie that is about to be released next .
పచ్చ రంగులో ఉన్న అక్షరాలు, మా సంగీత దర్శకురాలు చైతన్య స్రవంతి గారు స్వరపరచిన పాటలు. ‘ప్రేమించొద్దు’ సినిమాలో ఇప్పుడు కూడా ఈ పాటలు అవే సన్నివేశాల్లో కనిపిస్తాయి

 

_______________________________

13 Aug to 18 Sep 2015 (13 ఆగష్టు నుంచి 18 సెప్టెంబర్) 

Finally I narrated the story to Cinematographer Srujan Reddy . 

ఛాయాగ్రాహకుడు సృజన్ రెడ్డికి 'ప్రేమించొద్దు' సినిమా కథ మొత్తం చెప్పాను.

                                                                                                                    Page 13  

Division of work . 

Assigned different works to my Direction team. Take a look at the task related to “Names” assigned to Vaishnavi . The task is to identify if there are any similarly sounding names and how many times each name repeats.
Naming the top most important characters took at least 5-7 days per character. It has not been an easy task like Telugu movie Baby, where the characters' names have been named after the actors' names respectively. Our team of writers is not that lazy.
మా పని తీరు : ఇదీ నేనూ-నా బృందం పని చేసే తీరు. ఒక్క పేరు సినిమాలో ఎన్నిసార్లు వినపడాలి, ఎన్ని సన్నివేషాల్లో వినపడాలి అనేంత సూక్ష్మంగా పని చేస్తాము. ‘బేబి’ సినిమాలోని నటుల పేర్లే, పాత్రలకు పేర్లుగా పెట్టారు. నేనూ, నా దర్శకబృందం పాత్రలకు కూడా పేర్లు పెట్టలేనంత బద్ధకస్థులం అయితే కాదు. ఒక్కో ముఖ్యమైన పాత్ర పేరు పెట్టడానికి సుమారు 5-7 రోజులు పట్టేది.

30 Sep 2015 (సెప్టెంబర్)

Script First Draft pdf file of my teen movie mailed by our Co-writer Rahul Vanam .
మా సహాయక రచయిత రాహుల్ వనం సినిమా 'స్క్రిప్ట్' ఈ-మెయిల్ చేశాడు.

Please do observe the interval scene. Girl messages 2 boys at the same time and it's the  Interval Point. It’s directly lifted and modified into a cringe interval bang in Baby Movie.
మా ‘ఇంటర్వెల్’ సన్నివేశాన్నే గమనించండి.  అమ్మాయి సినిమా ఇంటర్వెల్ సమయంలో ఇద్దరు అబ్బాయిలకి ఒకేసారి ఫోన్ చేస్తుంది. ఈ సన్నివేశాన్ని కొట్టేసి ఒక జుగుప్త్సాకరమైన బూతు సన్నివేశంగా మార్చి ‘బేబి’ సినిమాలో వాడుకున్నారు.

_______________________________
 
                                                                                                                    Page 14

16 Nov 2015 (నవంబర్)

After Script First Draft got finished , we invited Script Readers
to understand the story from a fresh perspective

కథని ఒక కొత్త కోణంలో అర్ధం చేసుకోవాలని,
తెలుగు బాగా చదవగలిగే వాళ్ళని ఆహ్వానించాం.

 

Several emails about the movie work updates,
shows movie work was going on in full flow

కథకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి అనడానికి లెక్కలేనన్ని ఈ "ఈ-మెయిల్స్" ఏ సాక్షం.

31 Jan 2016 (జనవరి)

Updated Cinematographer Srujan Reddy that the movie work was going in full flow

కథకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి అని ఛాయాగ్రాహకుడు సృజన్ రెడ్డికి చెప్పాను.

 

_______________________________

                                                                                                                    Page 15  

Auditions

08 March 2016 (మార్చ్)

We have also done Acting Auditions for the Teen movie at Lamakaan Cultural Place located at Banjara Hills, Hyderabad.
Over 200 actors attended the Auditions.
It was an Audition call for actors , conducted under the film banner of Amrutha Productions . Poster shows clearly who is the Producer and who is the Director.
ఈ సినిమాకి నటీనటుల్ని ఎంపిక చేసే ప్రక్రియ కూడా మొదలయ్యింది. (వేదిక : లామాకాన్, బంజారాహిల్స్, హైదరాబాద్)  200 కళాకారులకు పైగా వచ్చారు.
పోస్టర్ లో సినిమా నిర్మాణ సంస్థ, నిర్మాత మరియు దర్శకుడి పేరు గమనించగలరు.

                                                                                                                    Page 16 

Some actors were Auditioned inside the very Amrutha Productions office. The girl in the yellow dress has also been selected and played an important role in my movie “Preminchoddu”
క్రింది ఫోటోలు చూడండి. కొందరు నటుల్ని మేము అమృత ప్రొడక్షన్స్ ఆఫీస్ లో కూడా ఎంపిక చేశాం. పసుపు రంగు దుస్తుల్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు ‘ప్రేమించొద్దు’ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది.


Cute Fact:
After a short period of time, well known actress Gayathri Gupta
also auditioned for the lead female role.
Few seconds clip of this audition video will be uploaded on youtube soon.

చూడముచ్చటైన వేషంలో గాయత్రి గుప్తా :
కొంతకాలం తరువాత ‘ప్రేమించొద్దు’ సినిమాలో ప్రధానపాత్ర కోసం మేము
నటి గాయత్రి గుప్తాను కూడా 'ఆడిషన్' చేయడం జరిగింది.
ఈ వీడియోని నేను త్వరలో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను




_______________________________
                                                                                                                    Page 17
How is Geetha Arts, a Pan-India film production company, involved in this ?
గీతా ఆర్ట్స్ అనే అతి పెద్ద సినిమా నిర్మాణ సంస్థ ఇందులో ఎలా భాగస్వామ్యం అయిఉంటుందా అని ఆశ్చర్యపోయాను!
When I first narrated the story to Director/Producer Sai Rajesh , he liked the story so much that he immediately told me that he would like to produce the film and also take one of his friend named SKN’s help to get support from Geetha Arts a very prestigious Telugu Production house , who were then coming up with a new banner GA 2 productions which is set up to encourage new talent and new scripts .
I made an Announcement on a Social Media platform that I am working with ‘Amrutha Productions’ owned by Director and Producer Sai Rajesh. And also added the phrase “Big Movie Production House”. It refers to Geetha Arts film production and distribution company
నేను దర్శకుడు నిర్మాత సాయి రాజేష్ కి కథ వివరించినప్పుడు, తను ఠక్కున "నేను ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను". మరియు తన మిత్రుడైన SKN అని పిలువబడే సినిమా నిర్మాత ద్వారా 'గీతా ఆర్ట్స్' అనే అతి పెద్ద సినిమా నిర్మాణ సంస్థకి ఈ కథని తీసుకెళ్తాను అని, హామీ ఇచ్చాడు . అప్పట్లో గీతా ఆర్ట్స్ వాళ్ళు తమ రెండవ బ్యానర్ GA-2 ని మొదలుబెట్టబోతున్నారనీ, అందులో చిన్న సినిమాలకి అవకాశాలు తప్పక ఇస్తారని నమ్మబలికాడు.
సాయి రాజేష్ స్థాపించిన అమృత ప్రొడక్షన్స్ తో కలిసి నేను వాస్తవ సంఘటన ఆధారంగా ఒక సినిమా (టీన్ మూవీ) తీయబోతున్నానని సామాజిక మాధ్యమాలలో ప్రకటించాను. నేను నా ప్రకటనలో "అతి పెద్ద నిర్మాణ సంస్థ"(Big Movie Production House) అని సూచన ఇచ్చాను . అది "గీతా ఆర్ట్స్" ని ఉద్దేశించి ఇచ్చినదే.

 

 

 

 

 

After I finished the first draft of my Teen Movie Script , Director/Producer Sai Rajesh fixed an appointment, at Geetha Arts Film Production Office, with another film producer .I narrated my Teen Movie Story to that new Producer in the office of Geetha Arts located in Nandagiri Hills, Jubilee Hills, Hyderabad, on 20th October 2015 . Time around 2pm to 5pm for 1 and half hours .
                                                                                                                    Page 18
The film producer's name is SKN, as told by Sai Rajesh, whom I met for the first and last time. Later i found his name as the Producer of the movie ‘Baby’
మా సినిమా 'స్క్రిప్ట్' పూర్తి అయిపోయాక నన్ను, డైరెక్టర్/ప్రొడ్యూసర్ సాయి రాజేష్, గీతా ఆర్ట్స్ లో ఇంకో ప్రొడ్యూసర్ కి కథ చెప్పమని అన్నారు. నేను మా సినిమా కథని, జూబిలీ హిల్స్ లో ఉన్న గీత ఆర్ట్స్ ఆఫీస్ లో 20 అక్టోబర్ 2015న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య సుమారు గంటన్నర చెప్పాను.

 
సాయి రాజేష్ చెప్పారు ఆ నిర్మాత పేరు SKN అని. అతన్ని నేను కలవడం అదే మొదటి మరియు చివరిసారి. తరువాత నాకు తెలిసింది 'బేబి' సినిమా నిర్మాత  అతనేనని.

Your


                                                                                                                    Page 19
Before I went to Geetha Arts I informed Cinematographer Srujan Reddy and Filmmaker Ravi Kiran about the story narration .You can see my conversation with Srujan Reddy and Ravi Kiran, they were asking me repeatedly about the story narrating experience .
Even though my story narration experience was not so great and the Producers kept on delaying the Project I never bad mouthed about them. I maintained a sense of decency .
నేను గీతా ఆర్ట్స్ కి వెళ్లే ముందు ఛాయాగ్రాహకుడు సృజన్ రెడ్డి మరియు దర్శకుడు రవి కిరణ్ కి ప్రొడ్యూసర్ ని కలవబోతున్నాను అని చెప్పాను. ఇద్దరూ నన్ను మరీ మరీ అడిగారు కథాచర్చ ఎలా జరిగింది అని. నా అనుభవం బాగా లేకపోయినా, నిర్మాతలు సినిమా పనులు ఆలస్యం చేస్తున్నా, నేను ఎప్పుడు వారి గురించి తప్పుగా మాట్లాడలేదు. సంయమనం పాటించాను., మర్యాదతోనే ఉన్నాను.

                                                                                                                    Page 20

Poster Punch 

The poster concepts were also lifted .
On 27 Oct 2015 one friend of mine sent me a photo mail
in which I saw a lot of scribblings on paper.
I asked her what she sent.
She said that whenever she is frustrated
she does such scribblings on the paper.
Based on this idea I tried some poster concepts.
I see this same wall scribbling concept on ‘Baby’ movie poster. 

పోస్టర్ ఐడియాలను కూడా కొట్టేశారు 

27 అక్టోబర్ 2015 న, నా స్నేహితురాలు పిచ్చిగీతలు గీసి ఉన్న ఒక ఫోటో నాకు పంపించింది. అది ఏంటి అని అడిగితే, తనకి తిక్కతిక్కగా ఉన్నప్పుడల్లా పిచ్చిగీతలు గీస్తాను అని చెప్పింది. దీన్ని ఆధారంగా చేసుకుని నేను కొన్ని పిచ్చిగీతలతో పోస్టర్ ఐడియాని తయారు చేసుకున్నాను. ఇలాంటి పిచ్చిగీతలతోనే 'బేబి' సినిమా పోస్టర్ ఒకటి నాకు కనిపించింది.


                                                                                                                    Page 21

Director Sai Rajesh is known in Telugu film industry for making Spoof films. So naturally he has a habit of lifting ideas from other movies and he proudly boasts in his interviews that he remixes others films into his own version. This time he has crossed all limits by stealing ideas from an unreleased film.
SPOOF Definition : a funny and silly piece of writing, music, theatre,movie  etc. that copies the style of an original work.
దర్శకుడు సాయి రాజేష్ కి తెలుగు సినీపరిశ్రమలో 'స్పూఫ్' సినిమాలు తీస్తాడు అని ఒక పేరు ఉంది. కాబట్టి స్వాభావికంగా ఇతర సినిమాల నుంచి ఆలోచనలని లేపేయడం అతనికి సర్వసాధారణం. తన ఇంటర్వ్యూల్లో కూడా ఇలా సినిమా దర్శకుల ఆలోచనలని ఎదేచ్చగా వాడేసుకుంటుంటానని చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఈ సారి మాత్రం అతని చర్యలు అన్ని పరిధులు దాటేశాయి. ఏకంగా రిలీజ్ అవ్వని సినిమా నుంచే ఐడియాలు చోరీ చేసేశాడు.
స్పూఫ్ నిర్వచనం : అసలైన కళావస్తువును తీసుకుని దాన్ని హాస్యాన్ని కలిగించే రచన లేదా సంగీతంగా లేదా మరో కొత్త కళావస్తువును ఉత్పత్తి చేయడం .

_______________________________
07 Sep 2015 (సెప్టెంబర్)

We designed another concept poster.It has 2 hands of a girl showing her ring finger of each hand . Each finger has a ring gifted by two boys, portraying confusion the girl is going through.
Was this Poster concept lifted and modified later by the Baby movie filmmakers? Yes, it seems so .
మేము ఇంకో పోస్టర్ ఐడియా తయారు చేశాము. అందులో ఒక అమ్మాయి రెండు ఉంగరపు వేళ్ళకు రెండు ఉంగరాలు ఉంటాయి. ఒక్కో ఉంగరం ఒక్కో అబ్బాయి ఇచ్చినది కనుక, ఆ అమ్మాయి గజిబిజి ఆలోచనలో ఉంటుంది అనేది ఆ పోస్టర్ కి సారాంశం.
ఈ పోస్టర్ ఆలోచనని ‘బేబి’ సినిమా వాళ్ళు కొట్టేసి తమకి అనుకూలంగా మార్చుకున్నారా ??
అవుననే అనిపిస్తుంది.

                                                                                                                    Page 22 

Photoshoot working stills for the concept poster

On 29 June 2023 the filmmakers of Baby released a poster, which is probably the worst poster in the history of Telugu Cinema. It is so distasteful and sexist, no woman in this world would support such an image. This portrays the dangerous mindset of the filmmaker and his interest in his ideology of objectifying a woman. Concept of the poster is a Middle finger inserted into a girl’s frock. See it yourself .
29 జూన్ 2023 న 'బేబి' సినిమావాళ్ళు, తెలుగు సినిమా చరిత్రలోనే ప్రతి ఒక్కరు తలదించుకునేలా, అతి నీచమైన పోస్టర్ విడుదల చేశారు. అది ఎంత హీనమైనది అంటే ఆడవారు ఎవ్వరైనా ఆ పోస్టర్ ని వ్యతిరేకిస్తారు. ఈ పోస్టర్ చూస్తే వీళ్ళ ఆలోచనా ధోరణి ఎంత భయంకరమైనదో స్పష్టంగా తెలుస్తుంది. మీరే చూడండి.

                                                                                                                    Page 23 

                                                                                                                    Page 24 

At first director Sai Rajesh did not like our poster concept. Maybe it looked too decent for him. Below is a screenshot of our direction team group chat.
I also found a recent Poster design from a Netflix series titled BEEF. The director of ‘Baby’ movie might have lifted the poster concept from this one too, as he has a habit of stealing ideas.
నిర్మాత సాయి రాజేష్ కి మా పోస్టర్ లో ఆలోచన నచ్చలేదు. చాలా పద్ధతిగా ఉంది కాబోలు.
కింద మా డైరెక్షన్ టీం గ్రూప్ మెసేజ్లు చూడొచ్చు
'బీఫ్' అనబడే సినిమాసిరీస్ కి సంబంధించిన పోస్టర్ ని 'నెట్ ఫ్లిక్' సంస్థ ఏప్రిల్ 2023 లో విడుదల చేసింది. అది కూడా అచ్చు ఇదే పోస్టర్ ఐడియా తో కలిగి ఉంది. ఏమో,చెప్పలేము బేబి సినిమా దర్శకుడు ఇందులో నుంచి కూడా కాపీ కొట్టి ఉండొచ్చు. తనకి ఐడియాలు కొట్టేయడం అలవాటే కాబట్టి..!!

 
The Baby movie team intentionally created a distasteful poster for publicity and played a drama in a press meet later, that they were feeling sorry for releasing such an unpleasant poster which insults a woman’s modesty . But this was a lie . Because later the director Sai Rajesh himself shared the same poster on his Instagram account story on 25 August 2023 , implying that he himself is endorsing the same Vulgar Poster of Baby.
'బేబి' సినిమా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చౌకప్రచారం కోసం ఒక అశ్లీలమైన పోస్టర్ ని విడుదల చేశారు. తరువాత తాము మీడియా ముందుకు వచ్చి అనుకోకుండా ఈ తప్పు చేశామని బుకాయించారు. ఇదొక పెద్ద అబద్ధం. దర్శకుడు సాయి రాజేష్ 25 ఆగష్టు 2023 న మళ్ళీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఇదే పోస్టర్ ని షేర్ చేశారు. అనగా ఈ అసభ్యకరమైన పోస్టర్ ని తాను ఆమోదించినట్టుగానే అర్ధం చేసుకోవచ్చు.

                                                                                                                                    Page 25

_______________________________

                                                                                                                     Page 26

Proud Moment

This post on a Social Media Movie Page named TOLLYMASTI is not anyway
related to these leaks.
But when our team saw this post we were all proud.
Because it gave us a morale boost .
We felt that the film we made will help the
Telugu Cinema take one step forward in whichever small way it can,
will make every Telugu person proud after watching our film and
also make them proud that we made this in 4 other languages
On the other hand the makers of Baby have made a
shameful act by stealing a story and also
making a cringe movie and thus took Telugu Cinema many steps back.

గర్వపడే క్షణాలు

టాలీ-మస్తీ అనే ఇంస్టాగ్రామ్ పేజీలో వచ్చిన ఈ పోస్ట్ కి మన అంశానికి సంబంధం లేకపోయినా ఈ విషయం చెప్పవలసి వస్తుంది. ఈ పోస్ట్ చూసి మా ‘ప్రేమించొద్దు’ బృందానికి చాలా గర్వంగా అనిపించింది. తెలుగు సినీపరిశ్రమ నుంచి వచ్చిన ఒక చిన్న సినిమా నేడు మొత్తం ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. ఇది తెలుగు సినిమాకే గర్వకారణం అని ఈ పోస్ట్ సారాంశం.
ఇంకో వైపు సిగ్గు లేకుండా కథ చోరీ చేసి, ఒక బూతుసినిమాగా మార్చి, 'బేబి' లాంటి సినిమా తీసినవాళ్ళు, తెలుగు సినిమాకి మరియు దర్శకవృత్తికే ఒక కళంకం.

         

                                                                                                            Page 27

This is Epic

As I said, on 13 May 2015, I made an Announcement on Social Media platform that I am working with ‘Amrutha Productions’ owned by Director and Producer Sai Rajesh , on a Teen Love Story based on true incidents . I thanked filmmaker Ravi Kiran for joining my story discussion for just 2 days. I felt it was my responsibility.
Many film personalities congratulated and wished for my success. I will always be thankful for them.
నేను ఇదివరకే చెప్పిన విధంగా, సాయి రాజేష్ అనబడే నిర్మాత స్థాపించిన అమృత ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణసంస్థతో కలిసి నేను వాస్తవసంఘటన ఆధారంగా ఒక సినిమా (టీన్ మూవీ) తీయబోతున్నానని సామాజిక మాధ్యమాలలో ప్రకటించాను. దర్శకుడు రవి కిరణ్ కేవలం రెండు రోజులు నా కథా చర్చలో పాల్గొన్నందుకు అతనికి ధన్యవాదాలు తెలిపాను. అది నా బాధ్యత అనిపించింది. కొందరు సినిమా ప్రముఖులు మరియు నా మిత్రులు నాకు అభినందనలు తెలిపారు, సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. వారికి నా ధన్యవాదాలు.

                                                                                                                                                    Page 28

_______________________________
                                                                                                                    Page 29
After realising that I will never get producers for my film, in the year 2017, I deleted the above post on Facebook App. But suspecting the Baby movie producers I saved the screenshots in my gmail.
I changed my movie working title from “Kanna Please” to “Preminchoddu
ఇంక నాకు నిర్మాతలు దొరకరు అని ఒక నిర్ధారణకు వచ్చాక నేను 7 ఫిబ్రవరి 2017 న, ఫేస్బుక్ ఆప్ లో పై పోస్ట్ ని డిలీట్ చేశాను. కానీ 'బేబి' సినిమా నిర్మాతల మీద అనుమానంతో ఆ 'స్క్రీన్ షాట్స్' ని జి-మెయిల్ లో భద్రపరిచాను.
నా సినిమా పేరుని '
కన్నా ప్లీజ్' నుంచి 'ప్రేమించొద్దు' గా మార్చాను .


_______________________________

                                                                                                                    Page 30 
While some serious things hit us hard in life, some other incidents make us laugh very hard . He loves our movie story.
Baby director himself commented on my facebook post :  
Expecting a sensational project .. The Story is that powerful , I am proud to be associated with this project .. good luck Shirin

ఎంతో బాధకలిగించే విషయాల్లో కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పించే సంఘటనలు అప్పుడప్పుడు మనకి ఎదురవుతాయి. 'బేబి' సినిమా దర్శకుడికి మన 'ప్రేమించొద్దు' నచ్చేసింది.
సాయి రాజేష్ కామెంట్ :
సంచలన సినిమా అవుతుంది అని అనుకుంటున్నా. ఆ కథలో అంత విషయం ఉంది. ఈ సినిమా లో భాగస్వామ్యం అవ్వడం నాకు గర్వంగా ఉంది... గుడ్ లక్ శిరిన్

_______________________________

The last message .

After the auditions in the month of March, next in April 2016 director Sai Rajesh vanished from his office for many days, not giving any updates about our movie. We were trying to contact him. Wanted to ask when our movie shoot would start.
Generally i call on phone directly but for the first time ever I messaged him through WhatsApp on 2 May 2016. I didn't get any reply about our meeting for 25 days. I never understood this. A person who said he would produce our movie and let us work on a movie script in his office for over one year, suddenly disappears and doesn't even have one day time to meet us, even though he lives in the same city.
Finally I decided to quit the place and messaged him last on 27 May 2016 .
This is the last message, after that No contact. After a few years he deleted me from his Facebook Friends list for no reason.
Only once Sai Rajesh spent some money for the Auditions, that's all.
In this one year I did not take one Rupee from him , all the expenses for my  direction team of 8 people were borne by me and my associate director Srinivas.

                                                                                                                    Page 31  

చివరి మెసేజి:
మార్చ్ నెలలో 'ఆడిషన్స్' అయిపోయాక, ఏప్రిల్ 2016 లో నిర్మాత సాయి రాజేష్ తన ఆఫీస్ లో
కలవడం మానేశాడు. మా సినిమాకి సంబంధించిన
వివరాలు చెప్పడం ఆపేసి పూర్తిగా మాయం అయిపోయాడు.
తనని కలవడానికి ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు.
మా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆందోళనలో ఉన్నమమ్మల్ని ఎడారిలో
వదిలేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ నేరుగా ఫోన్ చేసే నేను,
మొదటిసారి 2 మే 2016 న 'వాట్స్-ఆప్' లో మెసేజ్ చేశాను.
సంవత్సరం నుంచి సినిమా కథ మీద మేము అతని ఆఫీస్ లోనే పనిచేస్తున్నాము.
ఆ సినిమా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పిన ఒక వ్యక్తి,
ఒక్కసారిగా మాయం అయిపోవడం ఏమిటో! అదే నగరంలో ఉంటూ,
మాతో మాట్లాడడానికి ఒక్కరోజు కూడా అతనికి తీరిక లేకపోవడం ఏమిటో,
అంతా అనుమానాస్పదంగా అనిపించింది.
చివరకు, 27 మే 2016న అమృత ప్రొడక్షన్స్ ని వదిలి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాను.
ఇది నా చివరి మెసేజ్. తరువాత నేను ఇంక ఎప్పుడు అతన్ని కలవలేదు.
సాయి రాజేష్ ఒకే ఒక్కసారి నటీనటులను ఎంపిక చేసే 'ఆడిషన్స్' కార్యక్రమానికి ఖర్చుపెట్టాడు.
అది తప్ప నేను ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా తీసుకున్నదిలేదు.
8 మందితో కూడిన నా దర్శక బృందం కి సంబంధించిన
ఖర్చులు అన్నీ నేనూ మరియు నా సహాయకదర్శకుడు శ్రీనివాస్ భరిస్తూ వచ్చాము.
కొన్ని సంవత్సరాల తరువాత అతను నన్ను తన ఫేస్బుక్ ఫ్రెండ్స్ నుంచి అకారణంగా డిలీట్ చేసాడు.

Note : Steven Shankar is the screen name of Director/Producer Sai Rajesh.

గమనిక : సాయి రాజేష్ మొదటి రెండు సినిమాల్లో 'స్టీవెన్ శంకర్' అనే పేరుతో ప్రజలకి పరిచయం అయ్యాడు, అందుకే నా ఫోన్ లో ఆ పేరు తోనే 'నెంబర్ సేవ్' చేసుకున్నాను.



_______________________________

                                                                                                                     Page 32

Hurting moment

The public reaction to the way the character of the girl was portrayed hurted me a lot . 

Because of Baby filmmaker's insensitive writing, people reacted to the Basti Girl 

character very violently by hitting the posters with slippers. It's distasteful to my 

senses .
Vaishnavi and Sonali, my direction team members, watched the film and noted down 

some similar scenes they found in both the films. Please watch

 

బాధ కలిగించిన క్షణం

విభిన్న 'రివ్యూస్' వచ్చినా కూడా ప్రజల స్పందన మాత్రం శృతి మించింది. అమ్మాయి 'క్యారెక్టర్' ని 

'యూట్యూబ్ రివ్యూస్'లో దూషిస్తుంటే నాకు బాధేసింది. చాలా సున్నితంగా ఆలోచించి బస్తీ అమ్మాయి పాత్రని నేను తీర్చిదిద్దాను. కానీ బేబి సినిమా తీసినవాళ్లు అమ్మాయి వ్యక్తిత్వాన్ని నీచంగా దిగజార్చడం వల్ల కొందరు ప్రేక్షకులు దానికి విపరీత రీతిలో స్పందించారు. ఇంకొందరు చెప్పు దెబ్బలతో 'పోస్టర్' పై దాడి చేశారు. ఇది నాకు జుగుప్స కలిగించిన విషయం. నా దర్శకబృందంలో వైష్ణవి మరియు సోనాలి ని, రెండు సినిమాల్లోనూ ఒకే పోలికలతో ఉన్న కొన్ని సన్నివేశాలని వెతకమని చెప్పాను…. చూడండి..

 

..

                                                                                                                    Page 33

                                                                                                                    Page 34

                                                                                                                    Page 35

_______________________________

                                                                                                                    Page 36 

Past Relation and the Back stab   

Mahesh Kathi, a filmmaker and film critic, introduced me to Director/Producer Sai Rajesh. At first they wanted me to do cinematography for a Telugu film titled Hrudaya Kaleyam . I liked the concept of the film but I said I might not be doing the Cinematography because I was not yet fully skilled and ready.Later they moved on and Sai Rajesh directed an Intro Trailer which did not get the result as he expected . When I met Mahesh Kathi on the same day of the Trailer release he told me that Director Sai Rajesh was feeling depressed because of the poor response for his teaser . Then it's me who promised that I would make a  slightly better Trailer than the earlier one and told not to worry.
I directed, shot and edited the trailer in one to two weeks .We released the trailer at my home. When the Intro Trailer released it got 5 lakh views in 3 days which is a great number in the year 2013 . Soon the Trailer crossed 1 million views and got the attention of many big personalities from the Telugu film industry.
Sai Rajesh went on shooting his movie and after it finished he came back to me and requested me to edit the next Trailer. Again I obliged to his request and edited a new trailer, which again got good attention from people. I introduced Music Director Kamran to Sai Rajesh through this trailer. He later worked on Background score for 2 of Sai Rajesh’s films. Kamran also has given the Background Score for my movie ‘Preminchoddu’.
For both trailers of ‘Hrudaya Kaleyam’ I did not take any money.


గత పరిచయం మరియు వెన్ను పోటు

దర్శకుడు మరియు సినిమా విశ్లేషకుడు మహేష్ కత్తి నాకు దర్శకుడు/నిర్మాత సాయి రాజేష్ ని పరిచయం చేశారు. వాళ్ళు తీసే హృదయ కాలేయం అనే సినిమాకి ఛాయాగ్రహణం చేయమని అభ్యర్థించారు. “నాకు సినిమా సారాంశం నచ్చింది, కానీ నేను చేయలేను ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక సినిమాకి ఛాయాగ్రహణం చేయలేదు, అంత పట్టు నాకు లేదు” అని చెప్పాను.
తరువాత సాయి రాజేష్ ఒక ట్రైలర్ ని తీశాడు. అది అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. అదే రోజు నేను మహేష్ కత్తి ని కలిసినప్పుడు ఈ విషయాన్ని చెప్తూ దర్శకుడు సాయి రాజేష్ 'డిప్రెషన్' గా ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. అప్పుడు నేనే స్వయంగా కలిపించుకొని మాట ఇచ్చాను. బాధపడొద్దు, నేను అంతకన్నా కొంచం మంచి ట్రైలర్ నే తీసి ఇస్తాను అని.
 నేను ఈ కొత్త ట్రైలర్ కి దర్శకత్వం, ఛాయాగ్రహణం మరియు ఎడిటింగ్ చేసి ఇచ్చాను. మా ఇంట్లోనే ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము. అది రిలీజ్ ఐన మూడు రోజులకే 5 లక్షల 'యూట్యూబ్ వ్యూస్' వచ్చాయి. 2013లో అది చాలా గొప్ప విజయం. త్వరగా ఆ ట్రైలర్ 10 లక్షల వ్యూస్ కూడా దాటి, చాలా పెద్ద తెలుగు సినీ ప్రముఖుల కంట పడింది.
సాయి రాజేష్ తన సినిమా షూటింగ్ అయిపోయాక ఇంకో ట్రైలర్ చేసి ఇవ్వమని అభ్యర్ధించారు. వారి అభ్యర్ధనని మన్నించి నేను కొత్త ట్రైలర్ ని ఎడిట్ చేశాను. దానికి మళ్ళీ ప్రజల నుంచి  మంచి స్పందనే వచ్చింది. ఆ ట్రైలర్ ద్వారా 'కామ్రాన్' అనే సంగీత దర్శకుడిని సాయి రాజేష్ కి పరిచయం చేశాను. సాయి రాజేష్ తదుపరి రెండు సినిమాలకి కామ్రాన్ నేపధ్య సంగీతాన్ని అందించాడు. నా సినిమా 'ప్రేమించొద్దు' కి కూడా నేపధ్య సంగీతం కామ్రాన్ అందించాడు.
'హృదయ కాలేయం' సినిమాకి చేసిన రెండు ట్రైలర్లకి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

                                                                                                                    Page 37 

Director/Producer Sai Rajesh thanked me through a social media post.
In his words he said :
“It will be a big mistake if I don't thank two people Shirin Sriram and Kamran. I will be indebted to Shirin Sriram for making the trailer. He doesn't have any need to help me but he worked day and night for me. I want to thank Kamran for the background music”
Maybe from that day he was preparing for the backstab, so he was using those big words .
దర్శకుడు / నిర్మాత సాయి రాజేష్ నాకు కృతజ్ఞత తెలుపుతూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు.
అతని మాటలలో :
“ట్రైలర్ విజయంలో ఇద్దరి గురించి నేను చెప్పకపోతే ఖచ్చితంగా తప్పే. శిరిన్ శ్రీరామ్ గారికి ఋణపడి ఉంటాను. నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ రాత్రింబవళ్ళు నాకోసం కష్టపడ్డారు. కామ్రాన్ తన బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నా డైలాగ్స్ కి ప్రాణం పోశారు.”
ఇంత పెద్ద మాటలు మాట్లాడాడంటే ఆ రోజు నుంచే ఏదైనా పన్నాగం పన్నాడేమో.

                                                                                                                    Page 38 

Director/Producer Sai Rajesh used very big words like he will be indebted, he is thankful for our help, and some sweet messages that he will always be with me, etc,. then eventually Backstabbed
'ఋణపడి ఉంటాను' అని పెద్ద పెద్ద మాటలకి అర్ధం తెలిసే చెప్పాడో, తెలియక చెప్పాడో కానీ, వెన్నుపోటు మాత్రం గట్టిగానే పొడిచాడు.

In this world there are only a few people who cheat us . Many people are helpful and really stand by us. Here Srujan Reddy offers me his Cinema Camera. A Camera is very valuable for a Cinematographer.
ఈ ప్రపంచంలో మోసం చేసేవాళ్ళు కొందరైతే, సహాయం చేసేవాళ్ళు చాలా మందే ఉంటారు. అది మటుకు ఎప్పుడూ మరచిపోకూడదు. ఛాయాగ్రాహకుడు సృజన రెడ్డి ఏకంగా తన సినిమా కెమెరానే వాడుకొమ్మని ఆఫర్ ఇచ్చాడు.  కెమెరామాన్ వాళ్ళ కెమెరా ని సాధారణంగా ఎవ్వరికి ఇవ్వరు. అది వాళ్లకి అతి విలువైనది.

_______________________________
 

Not for cheap Publicity  (చవకబారు ప్రచారం కోసం కాదు)

This is a chat message with filmmaker Ravi Kiran to whom I was saying that, I waited for success for over 15 years and waiting for one more year wouldn't matter. This is to demonstrate that I am not doing any cheap publicity stunts but just revealing the facts and the injustice that I faced .
దర్శకుడు రవి కిరణ్ తో నా అనుభవాల్ని పంచుకుంటున్న క్రమంలో అతనికి నేను చేసిన ఒక మెసేజ్.
“15 ఏళ్ళు సక్సెస్ కోసం నిరీక్షించాను, ఇంకో సంవత్సరం అయినా పెద్ద కష్టం ఏమి కాదు” అని చెప్పాను.
అందరూ అర్ధం చేసుకోండి ఇది చవకబారు ప్రచారం కోసం చేయట్లేదు, కేవలం వాస్తవాలని బయటపెడుతున్నాను.

_______________________________
 
                                                                                                                    Page 39

Director/Producer Sai Rajesh told me not to use Telangana accent

When I was working on my Script in Amrutha Productions I told Producer Sai Rajesh that I want to write the dialogues in Telangana accent as I am from Telangana I am comfortable writing in a Telangana accent and the Story is set in the backdrop of Telangana Basti. But he denied saying, not every person might understand the Telangana accent. However in the Baby movie he used the Telangana accent for many of the Lead characters .
In 2017 I rewrote the entire script in the Telangana accent .
తెలంగాణ భాషలో రాయొద్దు అన్నాడు
నేను అమృత ప్రొడక్షన్స్ లో నా ఈ సినిమా కథ మీద పని చేసేటప్పుడు నిర్మాత సాయి రాజేష్ కి చెప్పాను, డైలాగ్స్ అన్ని తెలంగాణ యాస లోనే రాస్తాను అని. నేను తెలంగాణ పౌరుడిని కాబట్టి తెలంగాణ యాస లో సునాయాసంగా రాయగల్గుతాను. కథ కూడా తెలంగాణ బస్తీ నేపథ్యంలో జరుగుతుంది అని చెప్పాను. కానీ తెలంగాణ యాస అందరికి అర్ధం కాదు అని తిరస్కరించాడు. మరి 'బేబి' సినిమాలో ముఖ్య పాత్రలకి తెలంగాణ యాస ఎందుకు వాడాడో చెప్పగలరా??
2017 లో నేను నా కథ లో సంభాషణలన్నింటిని మళ్ళీ తెలంగాణ యాస లో రాశాను.


My Real Film-Journey started

నా సినిమా ప్రయాణం మొదలయ్యింది

After taking few months back , I started reworking on my film script and also freshly invited people to work in my film
కొంత కాలం తరువాత నా సినిమా కథ మీద మళ్ళీ పని చేయడం మొదలుపెట్టాను. కొత్త వారిని ఆహ్వానించాను.

                                                                                                                    Page 40 

Making of the bilingual film Preminchoddu (Pyar Mat Karna in HINDI) and later dubbing to 3 other South Indian languages is a beautiful experience I can never express in words . Every day has been a blessing
ద్విభాషాచిత్రం అయిన 'ప్రేమించొద్దు' (హిందీలో 'ప్యార్ మత్ కర్నా) తీయడం, ఆ తరువాత ఇంకో 3 భాషల్లోకి డబ్బింగ్ చేయడం వెరసి ఒక పాన్-ఇండియా సినిమాగా ముస్తాబవడం నాకు ఒక ఊహించని కల. ఇది మాటల్లో వర్ణించలేని ఒక అందమైన అనుభూతి. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీరోజు నాకు ఒక వరం.

_______________________________

                                                                                                                    Page 41 

FINAL WORD

చివరి మాట


Understanding Teenage psychology is a tough nut to crack. If we make a small 

blunder, it might ruin the characterizations in the movie. So I did extensive research 

on the psychology of teen students, visited many government Intermediate and 

polytechnic colleges and interacted with students. 

యుక్తవయస్సులో ఉన్న వారి మనస్తత్వం అర్ధం చేసుకోవడం కత్తి మీద సాము లాంటిదే. కథలో చిన్న తప్పు జరిగినా, దాని ప్రభావం పిల్లల మీద పడి చెడిపోయే అవకాశం ఉంది. అందుకే నేను ప్రభుత్వ 

ఇంటర్మీడియట్ మరియు పాలిటెక్నీక్ కళాశాలలకి వెళ్లి మరీ విద్యార్థులని కలిసాను. మృదువైన 

మనస్తత్వాలున్న పిల్లలకీ, వారి తల్లిదండ్రులకీ, చాలా సున్నితంగా తెలియజెప్పడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను.


But director Sai Rajesh took a shortcut route. He has done zero research, has zero 

empathy for teenagers and zero empathy for a debut film team genuinely trying to 

make a good movie. He assassinated the girl’s character in his movie story to 

provoke the sensitive emotions of the audience. This is the formula he chose to get 

maximum attention and viewership. 

Only people who lack creativity in writing genuine scenes depend heavily on cheap characterization and vulgar language and that's what he has done in his film ‘Baby’

కానీ దర్శకుడు సాయి రాజేష్ ఏ మాత్రం పరిశోధన చేయకుండా తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తన సినిమాలో ముఖ్యపాత్ర అయిన అమ్మాయి పాత్ర వ్యక్తిత్వాన్ని ఎంత దిగజార్చితే తన సినిమాకి అంతగా ప్రచారం దొరుకుతుంది అని భావించాడు. సృజనాత్మకత లోపించిన వాళ్ళే ఇలా దిగజారుడు పాత్రలని సృష్టిస్తారు, అసభ్యపదజాలాన్ని వాడుతారు. 'బేబి' సినిమా లో అదే చేశారు.


Film industry in India works many times on trust. It might be surprising for some 

people but that's the fact. There are some works where there is no paperwork 

involved but people blindly trust and crores worth of work is done only based on 

mere trust. I sent my full movie to 3 other states for dubbing. Tamil Nadu, Karnataka 

and Kerala. In this digital generation it's not a big task to steal the ideas from my 

movie or leak the digital copy of the film. But I can proudly say that I have never 

faced such incidents. There are 100s of film production companies where very young post-production technicians, lab assistants, and VFX artists work. They handle huge 

volumes of digital film data with high responsibility and trust.

సినిమాపరిశ్రమ నమ్మకం మీద నడుస్తుంది. కొంతమంది కోట్లలో వ్యాపారం కూడా ఏ పత్రం లేకుండా 

కేవలం నమ్మకం మీద నడిపిస్తారు. నేను నా సినిమా 'ప్రింట్' ని డబ్బింగ్ కోసం తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలకి పంపించాను. ఈ 'డిజిటల్' ప్రపంచంలో 'లీక్' చేయాలి అనుకుంటే ఒక్క క్షణం చాలు. కానీ నాకు అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురవ్వలేదని నేను గర్వంగా చెప్పుకుంటాను. 

సినీపరిశ్రమలో అతి చిన్న వయసులో ఉన్న సాంకేతిక నిపుణులు, స్టూడియోల్లో పనిచేసే కుర్రాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సినిమకి సంబంధిచిన 'డేటా'ను మూడో కంటికి కనబడకుండా చాలా బాధ్యతగా 

భద్రపరచుతారు. నమ్మకం అంటే ఏంటో వీరిని చూసి మనం చాలా నేర్చుకోవొచ్చు.
                                                                                                                    Page 42 

 Director of the ‘Baby’ movie broke this trust. From now it will be tough to identify whom to trust and whom not to trust in the film circles. When people come to know about this incident how will aspiring directors and writers ever dare to tell their stories to producers? Just think once. 

The whole film industry takes a unanimous stand on film piracy. I feel Story-Stealing is the real matter of concern and a more dangerous issue than film Piracy. 

దర్శకుడు సాయి రాజేష్, కంచే చేను మేసినట్టుగా, సినీపరిశ్రమలో ఉన్న ఈ నమ్మకాన్ని వమ్ము 

చేసేశాడు. ఇప్పటి నుంచి పరిశ్రమలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో గుర్తుపట్టడం కష్టమే. 

ఇప్పుడు ఈ సినిమా కథ దొంగలించారు అని నిరూపించుకోవడానికి కూడా, నాకు ఇన్ని ఆధారాలు 

బయటపెడితే తప్ప నమ్మరు అనే దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని తెలిస్తే రాబోయే తరాల దర్శకులు గాని రచయితలు గాని వాళ్ళు రక్తం దారబోసి రాసుకున్న వాళ్ళ కథలని నిర్మాతలకి ధైర్యంగా చెప్పగల్గుతారా? ఒక్కసారి ఆలోచించండి. 

సినీ పరిశ్రమ ఎప్పుడూ 'పైరసీ' భూతం గురించి గొంతు చించుకుంటూ ఉంటుంది. 'పైరసీ' ఒక భూతం అయితే 'కథలు-దొంగిలించడం' అనేది ఒక మహమ్మారి రోగం. దీన్ని 'లాక్-డౌన్' చేయకపోతే, భవిష్యత్తు దర్శకుల, రచయితల సున్నితమైన సృజనాత్మకతకే ప్రమాదం.


As a filmmaker my job is to spend maximum time on improving my creative skills. 

But this Case is exhausting for me and it will take a lot of time for me to get my 

creative energies back.

I feel that no director or writer should become a victim of such conspiracy. Those 

who hatch such conspiracies are highly insensitive. An insensitive person can never 

be creative. Incidents like these can damage genuine creative minds causing 

depression, anxiety, stress and can be suicidal .


Strict punishment must be given to such people or else they can steal more original 

stories, make more destructive films which are harmful for the society and for the film industry too.

నా కథని నేను ఎలా చెప్తే ప్రేక్షకులు ఆకర్షితులు అవుతారో మరియు దర్శకత్వంలో ఉన్న మెళుకువలు నేర్చుకొని ఎలా ఆచరించాలో అనేదే ఒక దర్శకుడిగా నా వృత్తిధర్మం. కానీ ఇలాంటి వివాదాస్పదమైన విషయాలని తప్పని సరి పరిస్థితుల్లో నా నెత్తిన వేసుకుని అలసిపోయాను. మళ్ళీ తిరిగి అంత శక్తిని నింపుకొని ఇంకో కొత్త కథ మీద పని చేయాలంటే చాలా సమయమే పట్టేలాగా ఉంది.

నాకు వచ్చిన ఈ పరిస్థితి ఇంకముందు ఏ దర్శకుడికి కానీ రచయితకి కానీ రాకూడదు. 'బేబి' దర్శకుడు చేసిన ఈ దుర్మార్గపు చర్య వల్ల ఒక కొత్త దర్శకుడి భవిష్యత్తు నాశనం అవుతుంది అని ఒక్క క్షణం కూడా తను ఆలోచించలేదు.

ఇలాంటి కథా-కుంభకోణాలు చేసేవారు చాలా మొద్దుబారిన మనస్కులయ్యి ఉంటారు. ఒక మొద్దుబారిన మనసున్నవారికి ఎప్పటికీ సృజనాత్మక హృదయం ఉండదు. ఇలాంటి సంఘటనల వల్ల నిజమైన ప్రతిభ కల్గినవారు మానసికఒత్తిడికీ, ఆందోళనకీ గురవుతారు. అవి విపరీత పరిణామాలకు దారి తీస్తాయి.


కఠినశిక్షలు పడకపోతే, ఇతరుల మేధోసంపత్తి దొంగిలించడం అనేది, సర్వసాధారణమైన విషయమే అని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. మరిన్ని చెత్త సినిమాలు తీస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇది సమాజానికి మరియు సినిమాపరిశ్రమకి చాలా ప్రమాదకరం .

                                                                                                                    Page 43

Reasons why we came late, almost after 4 months of the Baby movie release 

ఎందుకు ఈ విషయాన్ని ఆలస్యంగా వెలుగులోకి తెచ్చాం ?


Before the release of Baby it's difficult to know what's in the movie.
‘బేబి’ సినిమా రిలీజ్ అవ్వక ముందు వాళ్ళ సినిమాలో కథ ఏంటి అని తెలుసుకోవడం కష్టమే.

It took lot of time and patience for the Collection of evidence.
ఆధారాలు సేకరించడానికి చాలా ఓపిక మరియు సమయం పట్టింది.

I took advice from friends and well wishers for a while before revealing this scam to public.
చాలా మిత్రుల దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నాను.

I am not against the movie cast and crew, and in no way I want to ruin their success celebrations.
నేను ఆ సినిమా నటీనటులులకు గాని సాంకేతిక నిపుణులకు గాని వ్యతిరేకం కాదు. వారి విజయ వేడుకలను చెడగొట్టడం నా లక్ష్యం కాదు.

Not only collecting evidence, I also have my movie works to do.
ఆధారాలు సేకరించడమే కాదు, నా సినిమా పనులు నాకు ఉన్నాయి.

Before the release of 'Baby' movie I was doing test screenings of my movie 

PREMINCHODDU to various movie production houses and well-wishers. After 

‘Baby’ was released I had to stop all my Test screenings, for the fear that people 

might ask “why both the films have so many similar scenes”.  It took a while for us to mentally recover .


'బేబీ' సినిమా విడుదల అవ్వకముందు నేను 'ప్రేమించొద్దు' సినిమాని కొన్ని సినిమా నిర్మాణ సంస్థలకు మరియు నా శ్రేయోభిలాషులకు "టెస్ట్ స్క్రీనింగ్" చేస్తూ  ఉన్నాను. 'బేబీ' సినిమా విడుదల అయిన తరువాత నేను అన్ని టెస్ట్-స్క్రీనింగ్స్ ఆపేయాల్సి వచ్చింది. "ఎందుకు రెండు సినిమాల్లో సన్నివేశాలకి ఇన్ని పోలికలు ఉన్నాయి" అని అందరూ అడుగుతారని అనిపించింది. మేము మానసికంగా కోలుకోవడానికి సమయం పట్టింది.
_______________________________
                                                                                                                    Page 44
This Photograph was taken in a short film screening. First person from the left is director/producer, Amrutha Production house head, Sai Rajesh. Third person is me, Shirin Sriram. Person in the far right is actress Gayathri Gupta

ఇది ఒక లఘుచిత్రం  స్క్రీనింగ్ లో తీసిన ఫోటో.  ఎడమ వైపు ఉన్న మొదటి వ్యక్తి దర్శకుడు/నిర్మాత అమృత ప్రొడక్షన్స్ అధినేత సాయి రాజేష్ . మూడవ వ్యక్తిని నేను, శిరిన్ శ్రీరామ్. కుడి వైపు చివరన ఉన్నది నటి గాయిత్రి గుప్తా

#BabyLeaks

#PreminchodduMovie

#PreminchodduIsOriginal

#iSupportPreminchodduMovie

#iSupportPreminchoddu

Telugu #Preminchoddu

Hindi #PyarMatKarna

Tamil #Kaadhalikkathey

Kannada #Preetisabeda

Malayalam #Pranayikkaruth

 

Shirin Sriram : Social Media Accounts

https://www.youtube.com/shirinsriram


https://www.facebook.com/shirinsriramcafe


https://www.instagram.com/shirinsriram

 _______________________________

                                                                                                                    Page 45 

Why PREMINCHODDU is a must watch film ?  

ప్రేమించొద్దు తప్పక చూడాలి


Many film lovers might have a doubt , if it's the same story line why should we watch 

it again . So I am presenting here some major differences between the 2 films . This 

is to make people understand that they have been cheated with a substandard film.

 

ఒకే కథాంశంతో వచ్చే ఇంకో సినిమా మళ్ళీ ఎందుకు చూడాలి అని చాలా మంది సినిమా ప్రియులకు 

సందేహం కలగవచ్చు. 'టాలెంట్' లేకపోవడం వల్లే ఇలాంటి అభియోగాలు చేస్తున్నారు అని కూడా కొందరు అనవచ్చు. రెండు సినిమాలకి ఉన్న తేడా ఏంటో మాకు అనిపించినవి కొన్ని చెప్తాను చూడండి.

 


BABY (బేబి)

PREMINCHODDU (ప్రేమించొద్దు)

Duplicate (stolen and modified)

నకిలీ సరుకు

Original

అసలు సిసలైన కథ

Vulgar

అసభ్యకరం

Sensible

సున్నితమైన సన్నివేశాలు

Degraded the character of a girl.

Women feel uncomfortable and pained

అమ్మాయి వ్యక్తిత్వాన్ని చులకన చేయడం. 

ఆడవారిని ఇబ్బంది మరియు బాధ పెట్టేది.

Did not assassinate the girl's character. 

Anyone above 15 can watch

తప్పుని కేవలం తప్పు లాగా చూపించాం. 

వ్యక్తిత్వహననం చేయలేదు. 15 వయసు పైబడిన ఆడా, మగా, ఎవరైనా చూడొచ్చు

Not recommended for college students

కాలేజీ విద్యార్థులు చూడదగినది కాదు

College students must watch

కాలేజీ విద్యార్థులు తప్పక చూడవలసిన చిత్రం

Parents will object college students to watch

కాలేజీ విద్యార్థులు చూడొద్దు అని వారి తల్లిదండ్రులు కోరుకుంటారు

Parents will recommend to students 

కాలేజీ విద్యార్థులని చూడమని తల్లిదండ్రులే 

ప్రోత్సహిస్తారు

Boring second half 

సాగదీసి నీరసంగా చేసిన ‘సెకండ్ హాఫ్’

Thriller second half

ఉత్కంఠ కలిగించే ‘సెకండ్ హాఫ్’

Confusing characterization

గందరగోళంగా అనిపించే పాత్రల రూపకల్పన

Crystal clear characterization

కథలో పాత్రల స్పష్టమైన రూపకల్పన

Cheap third grade climax

చెత్త క్లైమాక్స్

Very balanced climax

అర్థవంతమైన క్లైమాక్స్

Irresponsible film content

బాధ్యతారాహిత్యంతో కూడిన కథారచన

Responsibly made

బాధ్యతలు మరువలేదు

Purposeless screenplay

అర్థరహితమైన కథనం

Message Oriented film

గమ్యం, గమనం, లక్ష్యం ఉంది

Your life is in someone else's hands

నీ జీవితం ఇంకొకరి చేతుల్లో ఉంటుంది

Your life is in your hands

నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది


                                                                                         Page 46

Here we present some scenes which we found similar in 2 films. 

We can't post all the similar scenes here, as our movie is not yet released. 

Thank you for Understanding . 

రెండు చిత్రాలలో మాకు ఒకే రకమైన సన్నివేశాలని ఇక్కడ అందిస్తున్నాను. మా సినిమా ఇంకా విడుదల కానందున మొత్తం సన్నివేశాలన్నింటినీ పోస్ట్ చేయలేము. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు .


 Page 47


 

                                                                                        Page 48

 

 

                                                                                        Page 49

 

 

                                                                                        Page 50

 

 

                                                                                        Page 51

 

 

                                                                                        Page 52

 

  

                                                                                        Page 53

 


                                                                                         Page 54 

Wolf of Manikonda  'పరేషాన్' దర్శకుడినే పరేషాన్ చేశిండు…పాపం :(

Rupak Ronaldson is the director of the comedy movie PARESHAN . We studied in the same film school. He directed another movie named Kobbari Matta, Written and produced by Sai Rajesh .

This movie Work was going on in the first floor of the same office situated in Manikonda. 

We were working for the movie Story of PREMINCHODDU.

Rupak always promotes ‘Pareshan’ as his debut movie, but not ‘Kobbari Matta’. Because of the horrific experience he had with the producer. Rupak worked there not just for 2 or 3 months but for more than 4 years, as a movie director. Finally when the movie was released Sai Rajesh himself declared the movie as a hit, and even now wherever he goes . Rupak asked to pay 1 lakh rupees finally after 4 years. Just to give you a clear picture this amount is just 2000 Rupees per month (for USA friends its just 25$) Sai Rajesh never paid a single rupee. This is the respect and value Sai Rajesh gives for a movie director.  


రూపక్ రోనాల్డ్‌సన్, ‘పరేషన్‌’ అనే కామెడీ సినిమాకి దర్శకుడు. మేం ఒకే ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నాం. అతను ‘కొబ్బరి మట్ట’ అనే మరో చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీనికి సాయి రాజేష్ రచయిత మరియు నిర్మాత. 

మణికొండలోని అదే కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఈ సినిమా పనులు జరుగుతున్నాయి. ప్రేమించొద్దు సినిమా కథ కోసం పని చేస్తున్నాం.

రూపక్ తన తొలి సినిమాగా ‘పరేషన్’ని ప్రమోట్ చేస్తుంటాడు, కానీ ‘కొబ్బరి మట్ట’ని కాదు. ఎందుకంటే నిర్మాతతో తనకు ఎదురైన భయంకరమైన అనుభవం వలన. రూపక్ అక్కడ కేవలం 2 లేదా 3 నెలలు పని చేసాడు అనుకుంటే పొరపాటు. 

4 సంవత్సరాలకు పైగా సినిమా దర్శకుడిగా పనిచేశాడు. ఎట్టకేలకు సినిమా విడుదలయ్యాక సాయి రాజేష్ స్వయంగా సినిమా హిట్ అని ప్రకటించాడు, ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా హిట్ సినిమా అనే చెప్తాడు. రూపక్ 4 సంవత్సరాల తర్వాత చివరకు 1 లక్ష రూపాయలు ఇవ్వమని కోరాడు. అర్ధం చేసుకోండి, నెలకు కేవలం 2000 రూపాయలు (USA స్నేహితులకు ఇది కేవలం 25$). సాయి రాజేష్ ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది సాయి రాజేష్‌ సినిమా దర్శకుడికి ఇచ్చే గౌరవం మరియు విలువ.

 

                                                                                        Page 55 

THE CHAT -

Friday, 4 October , 12:17am

RUPAK : Rajesh garu naku emaina money istara andi? Kodhiga tight ga vundhi andi

Tuesday, 22 October 2019 , 10:38 am

RUPAK : Hi andi heard about your father. I am extremely sorry for your loss. I was shocked to hear the news. He was a good friend and wonderful human being. May his soul rest in peace and hearty condolences to you and your family. Please Takecare jagratha

SAI RAJESH : Thanks for the msg rupak....sure...will take care of my family

Thursday, 28 November 2019 , 10:25 am

RUPAK : Rajesh garu I've worked for these many years without even asking money coz I trusted your words, Meere film ayipoyaka isthanu ani chepparu so thought you'll give. Think if you are in my situation andi, atleast one lakh aina istara? If I was doing other projects and making money adige vadini kadhu.

SAI RAJESH : I will give u one lakh rupak....but not right now....u want some time ... almost 80 lakhs was blocked by distributors...

May be i will pay in December ending

RUPAK : Sure andi.. Thanks alot

Sunday, 22 December 2019 , 10:35 am

RUPAK : Christmas varaku isthara andi money? i can give it to my parents..

Oorilo construction work jarugutundi it will be helpful.

Saturday, 28 December 2019, 0.25 am

RUPAK : Rajesh garu money arrange chestara?


KHATHAM… BYE BYE… TATA… GOOD BYE … GAYAA

 

                                                                                         Page 56

 QUESTIONS TO BE ASKED TO THE DIRECTOR OF TELUGU MOVIE ‘BABY’

1 Do you know Director Shirin Sriram? If Yes, when and how ? 

2 Did Shirin Sriram help you in any way in your film Career ? 

If Yes , how ? Was Shirin Sriram’s help important for you in your struggling days as a 

filmmaker or it would have been done by anyone as it's just a small help ?

3  Did Shirin Sriram’s team of 6 people work with you in your office under 

Shirin Sriram’s guidance ? 

4 Did you pay them any amount ? If Yes, how much monthly

5 Did Shirin Sriram team work with you for 6 months or for 1 year ?

6 What was their work? Did they work on any story ?

7 Did you tell him the story ? Or He told you the story first ? 

8 If you told him the story , why did you tell him the story ?

And in which year you came to know about the story ?

And why you thought of sharing this story only to Shirin Sriram?


What was your role ? Friend? Producer? Director ? Writer ? 

What was his role ? Friend? Producer? Director ? Writer ?

9  If he told you the story , what was the story he told you ?

10 Did you tell any of your friends or film circle people that you are working with Shirin Sriram on a story ?

11 Did you research on the Source story (Tamil Nadu brutal incident) that you are telling in your interviews ? Where did you get the scenes from ? Your own creativity or the source story or Shirin Sriram’s story scenes ?

12 If you took some scenes from Shirin Sriram’s story , did you inform Shirin Sriram that you took some scenes from his story? If No skip the question

13 The story that you registered in 2020 contains the same scenes  as the story you discussed with Shirin Sriram or is it your own scenes that you registered?

14 Did you make any public announcement that you are producing a teen film under the direction of  Shirin Sriram ? If you don't remember Skip the question

15 Did any actor come to your office for Audition for any role in Shirin Sriram film ?If you dont remember Skip the question

16 What was the reason you asked Shirin Sriram to narrate the story in Geetha Arts Movie Production office ?

                                                                                         Page 56

17 Is it true that you were absconding from your office and not meeting Shirin Sriram’s team without any reason, while they were trying to contact you ?

18 Have you seen any traits of malicious intentions Shirin Sriram had while he was working at your office or you realised recently ?

19 Are there any bad habits that you have observed in him that troubled you earlier ?

20 How many mutual friends does he have with you ? Roughly

21 What are the creative differences you had with Shirin Sriram, can you name a few ?

22 Did those creative differences turn into fights ?

23 Are your producers aware, where you have got this story from ?

24 Do you think, based on your observation of his behaviour, that it is Shirin Sriram who infringed and illegally plagiarised your intellectual property ?

25 What action will you take if you yourself have come to a conclusion that Shirin Sriram infringed your intellectual property ?

26 What action are you going to take if you feel that PREMINCHODDU movie director plagiarised your intellectual property ? And to know this will you watch that film ?

27 Did you ever realise that your actions would adversely affect a filmmaker or you never commit such actions at all as you are very sensitive towards creative people ?

 28 Since you feel Shirin Sriram only plagiarised your intellectual property , What action do you think that the film industry must take on Shirin Sriram ?

 29 As a responsible filmmaker from Telugu Cinema Do you want to give any message to the audience on Piracy and Plagiarism ?

30 As a very successful director what tips would you give to upcoming filmmakers                   to always be original? 

 


                                                                                          Page 58

Hello everyone,

This is Nikhilesh Thogari, Advocate (High Court of Judicature at Hyderabad)

I have known Film director  Shirin Sriram for more than a decade now as I used to follow his film works on Social Media platforms . 

అందరికీ నమస్కారం,

నేను నిఖిలేష్ తొగరి, న్యాయవాది (హైదరాబాద్‌లోని హైకోర్టు న్యాయస్థానం).

సినిమా డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ నాకు దశాబ్ద కాలంగా తెలుసు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 

అతని సినిమా పనులను గమనిస్తూ ఉండేవాడిని.


July 2023 (జూలై)

Telugu movie titled Baby released . Directed by Sai Rajesh (aka Steven Shankar) and Produced by SKN (Sreenivasa Kumara Naidu)

తెలుగులో బేబీ అనే సినిమా విడుదలైంది. సాయి రాజేష్ (స్టీవెన్ శంకర్) దర్శకత్వం వహించారు మరియు

SKN (శ్రీనివాస కుమార నాయుడు) నిర్మించారు


August 2023

In the month of August 2023 Shirin Sriram told me that his movie PREMINCHODDU has been plagiarised by the director of Telugu movie ‘Baby’ which released in the month of July . I did not believe that much as he just explained the incident in a superficial way. I asked him why it took one month for him to tell me. He explained that his team was in a state of shock as this kind of incident has never happened to them and they did not know how to react to such incident. 

ఆగస్ట్ 2023 నెలలో శిరిన్ శ్రీరామ్ నాతో చెప్పారు. తన సినిమా ‘ప్రేమించొద్దు’ కథని, దొంగలించి మార్పులు చేర్పులు 

చేసి 'బేబీ' సినిమా గా తీసి గత నెలలో విడుదల చేసుకున్నారు అని .

అతను నాకు జరిగిన సంఘటనను పూర్తిగా వివరించి చెప్పలేదు. కాబట్టి నేను పెద్దగా నమ్మలేదు.

నాకు చెప్పడానికి ఒక నెల ఎందుకు పట్టిందని అడిగాను. తన బృందం షాక్ లో ఉందని వివరించాడు.

ఇలాంటి సంఘటన తమకు ఎప్పుడూ జరగలేదని, మొదట్లో ఎలా స్పందించాలో అర్ధం కాలేదు అన్నారు


                                                                                                  Page 59 


September - October - November 2023

Later Shirin Sriram took 3 months to collect all evidence to support his argument. In the month of November 2023 he showed me his collection of evidence. After seeing those evidences even I got shocked for a while as I am not only an advocate , I am a filmmaker too and I understand a filmmaker’s pain and how much they work hard day and night with their writing team to construct a story and also I always had full faith in director Shirin Sriram’s skills since a long time .

సెప్టెంబర్ - అక్టోబర్ - నవంబర్ 2023

తరువాత శిరిన్ శ్రీరామ్ కి తన వాదనకు మద్దతుగా అన్ని ఆధారాలు సేకరించడానికి 3 నెలలు పట్టింది.

నవంబర్ 2023 నాటికి అతను తన సాక్ష్యాల సేకరణను నాకు చూపించాడు. ఆ సాక్ష్యాలు చూసిన తర్వాత

కాసేపు ఆశ్చర్యపోయాను. నేను న్యాయవాదిని మాత్రమే కాదు, చిత్ర దర్శకుడిని కూడా. ఒక చిత్ర దర్శకుడి

యొక్క బాధను, రాత్రియంబవళ్ళు వారి రచన బృందంతో కథను నిర్మించడానికి వారు ఎంత కష్టపడతారో నేను 

అర్థం చేసుకోగలను. దర్శకులు శిరీన్ శ్రీరామ్ నైపుణ్యంపై నేను ఎల్లప్పుడూ  పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను.


December 2023 

In the month of December 2023 my Legal team sent a notice to Sai Rajesh 

(aka Steven Shankar) the Director of telugu Movie ‘Baby’ and film Producer SKN (Sreenivasa Kumara Naidu), in which we mentioned that my Client Shirin Sriram has narrated a story of a Teenage Basti girl who falls in love with 2 boys , movie with working title Kanna Please (which later was renamed to PREMINCHODDU) to Director/ Producer Sai Rajesh Neelam, in the year 2015 . Sai Rajesh told that he liked the story and agreed to Produce this Teen Film. Director Shirin Sriram worked in Sai Rajesh’s Amrutha Productions office for one year with his team of 6 people . Also Shirin Sriram narrated this story to the producer of ‘Baby’ movie, named ‘SKN’ at the prestigious Film Production house of Geetha Arts office on 20th October 2015 around 2Pm to 5pm for more than 1 hour. Later after conducting the auditions of actors for this film, director Sai Rajesh was suspiciously absconding when Shirin Sriram was trying to contact him . Finally in May 2016, Shirn Sriram and his writing and direction team of 6 people left Amrutha productions office, leaving a Whatsapp message to Sai Rajesh to which he replied positively . They never called each other after that and cut to year 2023 Sai Rajesh and producer SKN released a Telugu movie named Baby which is copied and Vulgarly modified from the same innocent Basti girl story that Shirin Sriram narrated in the year 2015.

డిసెంబర్ 2023 నెలలో నా లీగల్ టీమ్, తెలుగు సినిమా ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్‌కు (స్టీవెన్ శంకర్) మరియు చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్. కు (శ్రీనివాస కుమార నాయుడు) నోటీసు పంపింది. నా క్లయింట్ 

శిరిన్ శ్రీరామ్ 2015 సంవత్సరంలో వర్కింగ్ టైటిల్‌ ‘కన్నా ప్లీజ్’ అనే కథను చెప్పారు. ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలో పడిన టీనేజ్ బస్తీ అమ్మాయి కథే కన్నా ప్లీజ్ (దీనిని తర్వాత ప్రేమించొద్దు గా మార్చాము) 

సాయి రాజేష్ నీలం కథ నచ్చిందని  తెలిపారు . ఈ టీన్ ఫిల్మ్‌ని నిర్మించడానికి అంగీకరించారు. తన 6 మంది టీమ్‌తో ఒక సంవత్సరం పాటు  దర్శకుడు శిరీన్ శ్రీరామ్ సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ ఆఫీస్ లో పనిచేశాడు.

అలాగే శిరిన్ శ్రీరామ్ 20 అక్టోబర్ 2015న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ ఆఫీస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ లో 1 గంట కంటే ఎక్కువ సమయం ఈ కథను ‘ఎస్‌.కె.ఎన్‌’ అనే ‘బేబీ’ సినిమా నిర్మాతకు వివరించాడు . ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఆడిషన్స్‌ నిర్వహించిన తరువాత దర్శకుడు సాయి రాజేష్ అనుమానాస్పదం గా పరారీలో ఉన్నాడు. శిరిన్ శ్రీరామ్ అతనిని సంప్రదించడానికి ప్రయత్నించారు.

 

                                                                                                  Page 60

 చివరగా మే 2016లో, శిరిన్ శ్రీరామ్ మరియు అతని 6 మందితో కూడిన రచన మరియు దర్శకత్వ బృందం ఒక వాట్సాప్ సందేశాన్ని పంపి అమృత ప్రొడక్షన్స్ కార్యాలయం నుండి వదిలి వెళ్లిపోయారు. దానికి సాయి రాజేష్ సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత ఒకరితో ఒకరు మళ్ళీ టచ్ లోకి రాలేదు. ఇక 2023 సంవత్సరం లో కళ్ళు తెరిచి చూస్తే సాయి రాజేష్ మరియు నిర్మాత SKN బేబీ  అనే తెలుగు సినిమాని విడుదల చేసారు. శిరిన్ శ్రీరామ్ సంవత్సరం పాటు పని చేసిన అమాయకమైన బస్తి అమ్మాయి కథ మరియు, అందులోని సన్నివేశాలే, మార్పులు చేర్పులు మరియు అశ్లీలతతో ఈ బేబీ సినిమాలో కనిపించాయి 


January 2024 

In the month of January 2024 we got a reply from Sai Rajesh’s legal team denying all 

the statements we made, calling our intentions baseless and malicious, threatening to file civil and criminal defamation cases on my client Shirin Sriram. Not knowing how to react to our legal notice and that he might be held liable for copyright infringement, Director Sai Rajesh Neelam came up with a new game plan to divert and escape this case . Director Sai Rajesh through his legal team says that he himself conceptualised the story idea about a young girl falling in love with two individuals, then narrated it to my client Shirin Sriram. Later entrusted Shirin Sriram to writing of a story in Amrutha Productions, that is the office of Sai Rajesh.

జనవరి 2024 నెలలో, సాయి రాజేష్ యొక్క లీగల్-టీం నుండి మాకు ప్రత్యుత్తరం వచ్చింది. మేము చెప్పేవి నిరాధారమైనవి అని, మా ఉద్దేశాలు హానికరమైనవి అని, మరియు నా క్లయింట్ శిరిన్ శ్రీరామ్ పై సివిల్ మరియు క్రిమినల్ పరువు నష్టం కేసులను దాఖలు చేయాల్సివస్తుంది అని హెచ్చరించారు. మా లీగల్ నోటీసుకు ఎలా ప్రతిస్పందించాలో తెలియక, కాపీరైట్ ఉల్లంఘనకు అతను బాధ్యత వహించే అవకాశం ఉంటుంది అనిపించి, దర్శకుడు సాయి రాజేష్ నీలం తన పై అభియోగాన్ని దారి మళ్లించడానికి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి,  కొత్త కథని అల్లారు. దర్శకుడు సాయి రాజేష్ తన లీగల్ టీమ్ ద్వారా చెప్పారు. ఇద్దరు వ్యక్తులతో ప్రేమలో పడే ఒక యువతి 

కథా ఆలోచనను, తనే స్వయంగా రూపకల్పన చేసి, ఈ కథ రాయడానికి తాను  శిరిన్ శ్రీరామ్ కి బాధ్యత 

అప్పగించాను అని ఈ కేసు లో ఒక వింత కథని అల్లారు.


Some important points mentioned in their Reply to us ,

With My observations and answers : 

వారు మాకు ఇచ్చిన ప్రత్యుత్తరంలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలు,

నా పరిశీలనలు మరియు సమాధానాలు:


1. LIE : Producer/Director Sai Rajesh is the one who told Shirin Sriram about the story 

of a Girl falling in love with 2 individuals, inspired from a news article. 

TRUTH :  Shirin Sriram got the story idea from an article posted by director Ravi Kiran, 

on Social media. Then narrated 60 scenes to director/producer Sai Rajesh .

అబద్దం - నిర్మాత/దర్శకుడు సాయి రాజేష్ , శిరీన్ శ్రీరామ్‌కి కథ చెప్పారు. ఇద్దరు వ్యక్తులతో అమ్మాయి ప్రేమలో

పడింది అనే ఒక వార్తా కథనం నుండి ప్రేరణ పొందారు సాయి రాజేష్.

నిజం -  దర్శకుడు రవికిరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కథనం నుండి శిరిన్ శ్రీరామ్‌కు కథ ఆలోచన వచ్చింది.

ఆ తర్వాత 60 సన్నివేశాలను దర్శకుడు/నిర్మాత సాయి రాజేష్‌కి వివరించాడు.


                                                                                                  Page 61

2. LIE : Sai Rajesh entrusted Shirin Sriram to writing of a story 

TRUTH : Shirin Sriram never worked as a writer ever for anyone else. He is an upcoming director and he naturally was in search of a producer. No one can employ him as a writer.

అబద్దం - సాయి రాజేష్ శిరీన్ శ్రీరామ్‌కి కథ రాసే బాధ్యతను అప్పగించారు.

నిజం -  శిరీన్ శ్రీరామ్ రచయితగా మరెవరికీ పని చేయలేదు. అతను ఒక దర్శకుడు, సహజంగా నిర్మాత కోసం అన్వేషణలో ఉన్నాడు. ఆయనను రచయితగా ఎవరూ నియమించలేరు.


3. LIE : Shirin Sriram worked in Sai Rajesh’s office only for a period of 6 months

TRUTH : Shirin Sriram joined and announced the project in May 2015 and messaged last to producer Sai Rajesh before leaving, in May 2016

అబద్దం - శిరిన్ శ్రీరామ్ సాయి రాజేష్ ఆఫీసులో 6 నెలల వ్యవధి మాత్రమే పని చేసాడు. 

నిజం - శిరిన్ శ్రీరామ్ మే 2015లో ప్రాజెక్ట్‌లో చేరారు మరియు ప్రకటించారు. మే 2016లో వదిలి వెళ్లే ముందు 

నిర్మాత సాయి రాజేష్‌కి చివరిగా మెసేజ్ పంపారు.


4. LIE : Shirin Sriram worked for a good and valuable consideration

TRUTH : Please give a clarification on what was that good valuable consideration. 

If its money, Shirin Sriram and his team of 6 did not receive a single paise.

అబద్దం - శిరిన్ శ్రీరామ్ కి మంచి విలువైన ముడుపు అందించాము . 

నిజం - దీని అర్ధం ఏంటో వివరంగా చెప్పండి . డబ్బు అయితే, శిరిన్ శ్రీరామ్ కి , అతని 6 అసిస్టెంట్స్ కి 

ఒక్క పైసా కూడా ఇవ్వబడలేదు



5. LIE : There was no discussion between the parties regarding the writing and direction of the movie PREMINCHOODDU (earlier named Kanna Please)

TRUTH : There are N number of evidences to prove this is a big Lie

అబద్దం - ప్రేమించొద్దు చిత్రం (గతంలో టైటిల్ కన్నా ప్లీజ్) రచన మరియు దర్శకత్వంకి సంబంధించి, 

ఇరువురి మధ్య ఎటువంటి చర్చ జరగలేదు

నిజం - ఇది పెద్ద అబద్ధమని నిరూపించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి


6. LIE : Registration of Baby Movie Script in Telugu Cine Writers Association by Director Sai Rajesh ensures protection of the script for over 99 years

TRUTH : Registration of a stolen story doesn't give anyone any right to use it

అబద్దం -  తెలుగు సినీ రచయితల సంఘంలో బేబీ మూవీ స్క్రిప్ట్ నమోదు చేసిన కారణంగా

సాయి రాజేష్ కి 99 సంవత్సరాలకు పైగా స్క్రిప్ట్‌ పై హక్కు ఉంది.

నిజం - దొంగిలించబడిన కథనాన్ని నమోదు చేయడం వలన దానిని ఉపయోగించుకునే హక్కు ఎవరికీ ఉండదు


7. LIE : Registered Baby movie script was only 30 pages in length and remaining portions of the script were conceptualised during the shoot. Proves its not copy.

TRUTH: Number of pages does not determine the magnitude of material copied. Infact single paper of Movie Scenes is enough to steal the soul of the story and make another movie.

అబద్దం - రిజిస్టర్ చేయబడిన బేబీ సినిమా స్క్రిప్ట్ కేవలం 30 పేజీలు. మిగిలిన భాగాలు

షూట్ సమయంలో స్క్రిప్ట్ కాన్సెప్ట్ చేయబడింది . అది కాపీ కాదని రుజువు అవుతుంది.

నిజం - పేజీల సంఖ్య, కాపీ చేయబడిన మెటీరియల్ పరిమాణాన్ని నిర్ణయించదు. కథలోని ఆత్మను దొంగిలించి 

మరో సినిమా తీయడానికి, సినిమా సీన్స్ రాసి ఉన్న, ఒక్క కాగితం ముక్క చాలు.

 

                                                                                                  Page 62

 

8. LIE : Shirin Sriram was aggrieved by the refusal so Sai Rajesh decided not to further entertain any Business relationship. Reason for my Shirin Sriram making defamatory claims.

TRUTH : No Business ever happened So no point in mentioning ‘Business relationship’. Shirin Sriram is a very stable person . He has undergone film training in film school. He understands the highs and lows in the creative field very much. 

While leaving Sai Rajesh’s Amrutha Productions also he posted his last message to them in a very polite manner. See the evidences yourself.

అబద్దం - సాయి రాజేష్ ఎటువంటి వ్యాపార సంబంధాలను కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడు కాబట్టి శిరీన్ శ్రీరామ్ ఈ తిరస్కరణతో బాధ పది కోపగించుకున్నాడు.

నిజం - అక్కడ ఎటువంటి వ్యాపారం జరగలేదు . శిరీన్ శ్రీరామ్ మానసికంగా స్థిరమైన వ్యక్తి. ఫిల్మ్ స్కూల్‌లో 

ఫిల్మ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. క్రియేటివ్ ఫీల్డ్‌లోని ఎత్తుపల్లాలను బాగా అర్థం చేసుకుంటాడు. సాయి రాజేష్ యొక్క 

అమృత ప్రొడక్షన్స్ నుండి నిష్క్రమించినప్పుడు, అతను చాలా మర్యాదపూర్వకంగా వారికి తన చివరి 

సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఆధారాలు మీరే చూడండి.


9 LIE : Shirin Sriram is making false, baseless claims with malicious intentions 

TRUTH : Intentions don't matter , only facts matter and the fact is Shirin Sriram first 

told the story of a Basti girl to Sai Rajesh , and the later promised that he would produce the film with working-title KANNA PLEASE (later renamed PREMINCHODDU)

అబద్దం - శిరీన్ శ్రీరామ్ దురుద్దేశంతో తప్పుడు వాదనలు, నిరాధారమైన వాదనలు చేస్తున్నారు.

నిజం - ఉద్దేశాలు అప్రస్తుతం, వాస్తవాలు మాత్రమే ముఖ్యమైనవి. వాస్తవం ఏమిటంటే శిరిన్ శ్రీరామ్ మొదట 

సాయి రాజేష్‌కి బస్తీ అమ్మాయి కథను చెప్పాడు. ఆపై వర్కింగ్ టైటిల్‌ కన్నా ప్లీజ్ (తరువాత ‘ప్రేమించొద్దు’ 

అని పేరు మార్చారు)తో చిత్రాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు సాయి రాజేష్‌.

 

February 2024 

On February 8th we lodged a complaint in the Police station of Rai Durgam, Cyberabad, Telangana State. Complaint was against the director and producers of Telugu movie Baby on offence under section 420 r/w 109, 102 (B) IPC and Sec 63 of Copyright Act -1967 with the ingredients of Cheating and Criminal Conspiracy. On February 28th  Police have sent us a Notice U/sec.91/160 Cr.P.C. to submit 

documentary evidence in support of our complaint and produce witnesses who are well acquaintance with the facts of the case.2 days after the complaint the News leaked through crime reporters to the media. Until that moment my Client Shirin Sriram hasn't spoken about this issue anywhere in the media and not even to many of his very close well wishers. Since it leaked into the Media, to avoid false narratives my Client went into few News channels only for one day to clarify the false narratives that are circulating. And till date he tries to maintain his calm because, we have full faith in the Legal System .But the Director and producer of ‘Baby’ movie from January onwards started to malign and threaten Shirin Sriram by writing lengthy letters to various film chambers and associations 

namely,  

Telugu Film Chamber of Commerce

Telugu Film Producers Council

Telugu Film Directors’ Association

Telugu Cine Writers Association

Telangana State Film Chamber Of Commerce

                                                                                                  Page 63

 What was the necessity for them to do this when we are already following a Legal procedure? 

This act is compelling my Client to reveal the evidences to these associations and to media channels who are questioning the credibility of my Client Director/Producer Shirin Sriram.


ఫిబ్రవరి 8వ తేదీన తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్‌లోని రాయ్ దుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాము. తెలుగు సినిమా 'బేబీ' దర్శక, నిర్మాతలపై ఫిర్యాదు చేసాం . సెక్షన్ 420 r/w 109, 102 (B) IPC మరియు సెక్షన్ 63 కాపీరైట్ చట్టం -1967,  మోసం మరియు నేరపూరిత కుట్రకు సంబంధించిన అంశాలతో కేసు నమోదు చేశారు . ఫిబ్రవరి 28న పోలీసులు మాకు U/sec.91/160 Cr.P.C నోటీసు పంపారు. మా ఫిర్యాదుకు మద్దతుగా డాక్యుమెంటరీ సాక్ష్యం మరియు కేసు వాస్తవాలతో బాగా పరిచయం ఉన్న సాక్షులను తయారు చేయండి  అని సూచించారు

ఫిర్యాదు చేసిన 2 రోజుల తర్వాత మీడియాకు క్రైమ్ రిపోర్టర్ల ద్వారా న్యూస్ లీక్ అయింది. ఆ క్షణం వరకు నా క్లయింట్ శిరిన్ శ్రీరామ్ ఈ సమస్య గురించి ఎక్కడా మాట్లాడలేదు. మీడియా మరియు అతని చాలా సన్నిహిత శ్రేయోభిలాషులతో కూడా మాట్లాడలేదు. మీడియాలోకి లీక్ అయినప్పటి నుంచి తప్పుడు కథనాలను నివారించడానికి నా క్లయింట్ కొన్ని వార్తా ఛానెల్‌లలోకి కేవలం ఒకే రోజు వెళ్ళాడు. ఇప్పటికి కూడా తాను సంయమనం తోనే ఉన్నాడు. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.


కానీ జనవరి నుంచి ‘బేబీ’ సినిమా దర్శకుడు, నిర్మాత, శిరీన్ శ్రీరామ్‌ పై పలు ఫిల్మ్‌ఛాంబర్‌లు, 

అసోసియేషన్‌లకు సుదీర్ఘ లేఖలు రాస్తూ బెదిరించడం మొదలుపెట్టారు.

అవి,

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్

తెలుగు సినిమా దర్శకుల సంఘం

తెలుగు సినీ రచయితల సంఘం

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్


మేము ఇప్పటికే చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు వారు ఇలాంటి పనులు చేయవలసిన 

అవసరం ఏమిటి? నా క్లయింట్ డైరెక్టర్/నిర్మాత శిరిన్ శ్రీరామ్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ఈ అసోసియేషన్‌లకు మరియు మీడియా ఛానెల్‌లకు సాక్షాధారాలను బహిర్గతం చేయక తప్పడం లేదు.


                                                                                                  Page 64


Here I present you the matter they have been trying to circulate in film circles through these below film associations and chambers.

వారు ఫిల్మ్ అసోసియేషన్లు మరియు ఛాంబర్ల ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఎలా దుష్ప్రచారం చేయడానికి 

ప్రయత్నిస్తున్నారో మీరే చూడండి

 


                                                                                                  Page 65

 


                                                                                                  Page 66 

 

                                                                                                  Page 67

 

  



 

                                                                                                 Page 68

 

 

                                                                                                      Page 69

 

                                                                                           

                                                                                                 Page 70

Demands

Accept the whole truth in public platform that the story of Basti girl falling 

in love with 2 individuals one  who is poor and another who is rich, was first 

narrated by Shirin Sriram to you (Sai Rajesh) , and you promised him that you 

would produce his film but later failed to produce. In 2023 you released a 

Telugu Movie named ‘Baby’ whose story was essentially stolen and modified 

version of the same story earlier narrated to you by film director Shirin Sriram

బస్తీ అమ్మాయి ఒక పేద వాడితో మరియు ఒక ధనవంతుడితో ప్రేమలో పడిన కథ, మొదట శిరిన్ శ్రీరామ్ మీకు వివరించాడు అనే వాస్తవాన్ని మీరు (సాయి రాజేష్) బహిరంగ వేదికపై అంగీకరించాలి. మరియు మీరు అతని చిత్రాన్ని నిర్మిస్తామని వాగ్దానం చేసారు కానీ తరువాత నిర్మించడంలో విఫలమయ్యారు. 2023లో మీరు ‘బేబీ’ అనే తెలుగు సినిమాని విడుదల చేసారు, దాని కథ ప్రధానంగా, దర్శకుడు శిరీన్ శ్రీరామ్ మీకు ఇంతకు మునుపు చెప్పిన కథ ఆధారంగానే తీశారు అని ఒప్పుకోవాలి.


Compensation as per the Copyright Act, 1957

కాపీరైట్ చట్టం, 1957 ప్రకారం పరిహారం


You should not sell the script, should not dub or remake the film 

into any other language

మీరు స్క్రిప్ట్‌ను అమ్మకూడదు, సినిమాను వేరే భాషలోకి డబ్ లేదా రీమేక్ చేయకూడదు

                                                                                                  Page 71


 समय जब निर्णय करता है, तब गवाहों की ज़रुरत नहीं होती |


Hindi #PyarMatKarna Tamil #Kaadhalikkathey 

Kannada #Preetisabeda Malayalam #Pranayikkaruth

                                                                                                 Page 72

Baby Leaks 2023

Baby Leaks Pdf and Videos   👉 DOWNLOAD HERE    _______________________________________________________     Page 2 స్పూఫ్ సినిమాలు తీస్తే డ...